ప్రాథమిక దశలోనే వ్యాధుల కట్టడికి చర్యలు

గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధి ముదిరాక ప్రజలు ఆసుపత్రికి వస్తున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాథమిక దశలోనే వ్యాధుల కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు

Published : 29 Nov 2021 04:25 IST

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు

ఆసుపత్రి త్రీడీ నమూనాను పరిశీలిస్తున్న తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, జన మంగళం ట్రస్టు

ప్రతినిధి డా.సీబీ సత్పతి, డీఆర్‌డీవో ఛైర్మన్‌ సతీష్‌రెడ్డి, మంత్రి హరీశ్‌రావు తదితరులు

సోమాజిగూడ, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధి ముదిరాక ప్రజలు ఆసుపత్రికి వస్తున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాథమిక దశలోనే వ్యాధుల కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో నాలుగు వేల పల్లె దవాఖానాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని ఆయన చెప్పారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపూర్‌లో జన మంగళం ట్రస్టు ఏర్పాటు చేస్తున్న 250 పడకల ఆసుపత్రి నమూనాను హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, డీఆర్‌డీవో ఛైర్మన్‌ సతీష్‌రెడ్డి, సినీ నటుడు మోహన్‌బాబుతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘‘గతంలో లేనివిధంగా 30-40 ఏళ్ల వయసులోనే రక్తపోటు, మధుమేహం స్థాయి పెరుగుతోంది. ఇలాంటి వాటిని ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు పల్లె దవాఖానాలు అందుబాటులోకి తెస్తున్నాం. ప్రతి 2-3 గ్రామాలకు ఒక వైద్యుడిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది’’ అని వివరించారు. వై.వి.సుబ్బారెడ్డి, సతీష్‌రెడ్డి, సినీ నటుడు మోహన్‌బాబు మాట్లాడారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నవీన్‌రావు, మెదక్‌ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ట్రస్టు ప్రతినిధి డా.సీబీ సత్పతి, వరప్రసాద్‌రెడ్డి(శాంతా బయోటెక్‌) తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని