వైద్యారోగ్య రంగంపై పెరిగిన ప్రభుత్వ వ్యయం

వైద్యారోగ్య రంగంపై ప్రభుత్వం చేసే ఖర్చు స్థూల జాతీయోత్పత్తిలో(జీడీపీ)లో 1.35 శాతానికి చేరింది. కేంద్ర వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌భూషణ్‌ సోమవారం విడుదల చేసిన ‘జాతీయ హెల్త్‌

Updated : 30 Nov 2021 04:35 IST

జీడీపీలో 1.15% నుంచి 1.35% వృద్ధి
2017-18 నివేదికను విడుదల చేసిన కేంద్రం

ఈనాడు, దిల్లీ: వైద్యారోగ్య రంగంపై ప్రభుత్వం చేసే ఖర్చు స్థూల జాతీయోత్పత్తిలో(జీడీపీ)లో 1.35 శాతానికి చేరింది. కేంద్ర వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌భూషణ్‌ సోమవారం విడుదల చేసిన ‘జాతీయ హెల్త్‌ అకౌంట్స్‌ అంచనాల నివేదిక.. 2017-18’ ఈ విషయాన్ని వెల్లడించింది. 2013-14లో ప్రభుత్వం ఈ రంగంపై చేసిన వ్యయం జీడీపీలో 1.15 శాతంగా ఉంది. ఇదే సమయంలో దేశంలో మొత్తం వైద్యఆరోగ్య వ్యయంలో ప్రభుత్వం వాటా 28.6 శాతం నుంచి 40.8 శాతానికి పెరిగింది. ప్రజలు సొంత జేబుల్లోంచి చేసే తలసరి ఖర్చు రూ.2,336 నుంచి రూ.2,097కి తగ్గింది. సాధారణ ప్రభుత్వ వ్యయంలో వైద్య ఆరోగ్య రంగంపై చేసే వ్యయ వాటా 2013-14లో 3.78 శాతం ఉండగా, 2017-18 నాటికి అది 5.12 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో ప్రభుత్వం చేసే తలసరి వ్యయం రూ.1,042 నుంచి రూ.1,753కి చేరింది. ప్రాథమిక ఆరోగ్య రంగంపై చేసే ఖర్చు 51.1 శాతం నుంచి 54.7 శాతానికి చేరింది. ప్రభుత్వం ఈ రంగంలో చేసే వ్యయంలో 80% ప్రాథమిక, మాధ్యమిక ఆరోగ్యరంగంపైనే ఉంది. 2016-17, 2017-18 మధ్యకాలంలో ప్రభుత్వం ప్రాథమిక, మాధ్యమిక ఆరోగ్య రంగంపై చేసే వ్యయం 75 నుంచి 86 శాతానికి పెరగ్గా, ఇదే విభాగాల్లో ప్రైవేటు రంగం వ్యయం 84 నుంచి 74 శాతానికి తగ్గింది. దేశవ్యాప్తంగా సామాజిక వైద్య ఆరోగ్య బీమా, ప్రభుత్వ బీమా పథకాలు, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ సేవలు పెరిగాయి. మొత్తం ఆరోగ్య వ్యయంలో వీటి వాటా 2013-14లో 6 శాతం ఉండగా, 2017-18లో 9 శాతానికి చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని