6 నెలల్లోపు అనుమతులు తీసుకోకపోతే ప్రాజెక్టులు నిలిచిపోయినట్లే

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి వచ్చే అనుమతులులేని ప్రాజెక్టులకు ఆరు నెలల్లోపు అనుమతులు తీసుకోవాలని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తెలిపారు. లేదంటే పూర్తైన, కొనసాగుతున్న

Published : 30 Nov 2021 04:25 IST

నోటిఫికేషన్ల అమలును వాయిదా వేసే ప్రసక్తే లేదు
కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్‌

ఈనాడు, దిల్లీ: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి వచ్చే అనుమతులులేని ప్రాజెక్టులకు ఆరు నెలల్లోపు అనుమతులు తీసుకోవాలని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తెలిపారు. లేదంటే పూర్తైన, కొనసాగుతున్న ప్రాజెక్టుల నిర్వహణ కార్యక్రమాలు ఆగిపోయినట్లేనని స్పష్టం చేశారు. సోమవారం రాజ్యసభలో భాజపా సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘జులై 15న జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్ల ప్రకారం రెండు బోర్డులు అమల్లోకి వచ్చాయి. వాటి నిర్వహణను నిలిపేసే ప్రసక్తే ఉత్పన్నం కాదు. ఈ బోర్డులు అమల్లోకి వచ్చిన నాటినుంచి 60 రోజుల్లోపు రెండు తెలుగు రాష్ట్రాలు ఏకమొత్తం కింద ఒక్కో బోర్డుకు రూ.200 కోట్ల చొప్పున సీడ్‌మనీ డిపాజిట్‌ చేయాల్సి ఉంది. ఇంతవరకూ ఏ రాష్ట్ర ప్రభుత్వమూ తమ వాటా మొత్తాన్ని డిపాజిట్‌ చేయలేదు. రెండు రాష్ట్రాలూ తమ పరిధిలోని బ్యారేజీలు, డ్యాములు, రిజర్వాయర్లు, రెగ్యులేటింగ్‌ స్ట్రక్చర్లను బోర్డులకు అప్పగించాల్సి ఉంది. ఇప్పటివరకూ రెండు రాష్ట్రాలూ ఆ పనిచేయలేదు. ’ అని గజేంద్రసింగ్‌ షెకావత్‌ పేర్కొన్నారు.

శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి కోసం నీరు విడుదల చేయొద్దని తెలంగాణకు లేఖ
శ్రీశైలం జలాశయం నుంచి కేవలం విద్యుదుత్పత్తికోసం నీటి విడుదలను ఆపేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి కేఆర్‌ఎంబీ నవంబరు 18న లేఖరాసినట్లు కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ టుడు తెలిపారు. సోమవారం రాజ్యసభలో భాజపా సభ్యుడు టీజీ వెంకటేష్‌ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని