స్థానిక సంస్థలకు రూ. 8,587 కోట్లు

కేంద్ర ప్రభుత్వం 14, 15 ఆర్థిక సంఘాల సిఫార్సులను అనుసరించి తెలంగాణలోని గ్రామీణ స్థానిక సంస్థలకు 2015 నుంచి ఇప్పటివరకు రూ.8,587.29 కోట్లు కేటాయించినట్లు కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ సహాయమంత్రి కపిల్‌ మోరేశ్వర్‌ పాటిల్‌ తెలిపారు. మంగళవారం లోక్‌సభలో

Updated : 01 Dec 2021 04:25 IST
 ఆరేళ్ల కాలంలో విడుదల
కొత్తగా కృషి విజ్ఞాన్‌ కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనేదీ లేదు
పార్లమెంటులో వెల్లడించిన కేంద్రం

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వం 14, 15 ఆర్థిక సంఘాల సిఫార్సులను అనుసరించి తెలంగాణలోని గ్రామీణ స్థానిక సంస్థలకు 2015 నుంచి ఇప్పటివరకు రూ.8,587.29 కోట్లు కేటాయించినట్లు కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ సహాయమంత్రి కపిల్‌ మోరేశ్వర్‌ పాటిల్‌ తెలిపారు. మంగళవారం లోక్‌సభలో తెరాస ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. కేటాయించిన నిధుల్లో రూ.7,589.59 కోట్లు(88.38%) విడుదలచేయగా, రూ.7,219.46 కోట్లు(95.12%)ఖర్చయినట్లు చెప్పారు. 14వ ఆర్థిక సంఘం కాల పరిధిలో రూ.5,375.29 కోట్లకుగానూ రూ.5,060.09 కోట్లు (94.13%) విడుదల చేయగా, నూరు శాతం ఖర్చయినట్లు, 15వ ఆర్థికసంఘం కాల పరిధిలో విడుదలైన రూ.3,212 కోట్లకుగానూ రూ.2,529.50 కోట్లు (78.75%) విడుదల చేయగా, రూ.2,159.37 కోట్లు (85.36%) ఖర్చయినట్లు తెలిపారు.

* తెలంగాణలోని 31 జిల్లాలకుగానూ ప్రస్తుతం 16 జిల్లాల్లో కృషి విజ్ఞాన్‌ కేంద్రాలు ఉన్నట్లు కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఈ కేంద్రాలు ఏర్పాటుచేసే ప్రతిపాదనేదీ లేదని ఎంపీలు పసునూరిదయాకర్‌, వెంకటేష్‌నేత, మాలోతు కవిత, జి.రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు  సమాధానంగా స్పష్టంచేశారు.


రైతు కుటుంబం ఆదాయం నెలకు రూ.9,403
 ఖర్చు రూ.7,706
 ఏపీలో రాబడి రూ.10,480..ఖర్చు రూ.11,919
 జాతీయ గణాంక సర్వేలో వెల్లడి

ఈనాడు, దిల్లీ: తెలంగాణ రైతు కుటుంబాలకు నెలకు సగటున రూ.9,403 ఆదాయం సమకూరుతోందని, అదే సమయంలో ఖర్చు రూ.7,706 మేర ఉంటోందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు. ఇందులో పంట ఉత్పత్తి కోసం రూ.6,543, పశువులకోసం రూ.1,163 మేర వ్యయమవుతున్నట్టు వెల్లడించారు. జులై 2018- జూన్‌ 2019 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లో రైతు కుటుంబ ఆదాయం నెలకు రూ.10,480గా, ఖర్చు రూ.11,919 (పంట ఉత్పత్తికోసం రూ.8,847, పశువుల కోసం రూ.3,072)గా ఉన్నట్లు తెలిపారు. మంగళవారం లోక్‌సభలో ఒడిశా సభ్యుడు సప్తగిరి ఉల్కా అడిగిన ప్రశ్నకు ఆయన ఈమేరకు సమాధానమిచ్చారు. 2019 జనవరి-డిసెంబరు మధ్య కాలంలో దేశంలోని వ్యవసాయ కుటుంబాల ఆర్థిక స్థితిగతులపై జాతీయ గణాంక కార్యాలయం నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైనట్లు చెప్పారు. ‘‘మేఘాలయ (రూ.29,348), హరియాణా (రూ.22,841) రైతు కుటుంబాల నెలసరి ఆదాయం అన్ని రాష్ట్రాలకంటే అధికంగా ఉంది. పంటసాగుకయ్యే నెలవారీ ఖర్చు పంజాబ్‌ (రూ.11,277) హరియాణా(రూ.11,190)లలో అత్యధికంగా నమోదైంది. పశువులకోసం అత్యధికంగా నెలవారీ ఖర్చుపెట్టే రాష్ట్రాల్లో కేరళ (రూ.3,191), పంజాబ్‌ (3,118) తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్‌ (రూ.3,072) నిలిచింది’’ అని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని