రెండేళ్లలో రూ.21,552 కోట్ల లోటు

వచ్చే రెండేళ్లలో ఆర్థిక లోటు రూ.21,552 కోట్లకు చేరుతుందని రాష్ట్రంలోని రెండు విద్యుత్తు పంపిణీ సంస్థ(డిస్కం)లు వెల్లడించాయి. ఈ ఏడాది (2021-2022), వచ్చే ఏడాది (2022-23)కి సంబంధించిన ఆదాయ, వ్యయాల లెక్కలతో వార్షిక ఆదాయ అవసరాల నివేదికలను రెండు సంస్థల అధికారులు

Updated : 01 Dec 2021 05:55 IST

విద్యుత్తు నియంత్రణ మండలికిచ్చిన నివేదికల్లో డిస్కంల వెల్లడి
లోటు పూడ్చాలంటే ఛార్జీలు పెంచాల్సిందే : ఈఆర్‌సీ

డిస్కంలుఅందజేసిన ఏఆర్‌ఆర్‌ నివేదకను చేపుతున్న ఈఆర్‌సీ శ్రీరంగారావు, సభ్యులు ఎండీ మనోహర్‌రాజు, బి కృష్ణయ్య

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే రెండేళ్లలో ఆర్థిక లోటు రూ.21,552 కోట్లకు చేరుతుందని రాష్ట్రంలోని రెండు విద్యుత్తు పంపిణీ సంస్థ(డిస్కం)లు వెల్లడించాయి. ఈ ఏడాది (2021-2022), వచ్చే ఏడాది (2022-23)కి సంబంధించిన ఆదాయ, వ్యయాల లెక్కలతో వార్షిక ఆదాయ అవసరాల నివేదికలను రెండు సంస్థల అధికారులు మంగళవారం సాయంత్రం విద్యుత్తు నియంత్రణ మండలి(ఈఆర్‌సీ)కి అందజేశారు. ఈ సందర్భంగా ఈఆర్‌సీ ఛైర్మన్‌ శ్రీరంగారావు, సభ్యులు ఎండీ మనోహర్‌రాజు, బి.కృష్ణయ్యలతో కలసి ఆ వివరాలను వెల్లడించారు. మొత్తం రూ.32,856 కోట్ల ఆర్థిక లోటు ఉంటుందని, ఇందులో రెండేళ్లకు కలిపి ప్రభుత్వ రాయితీగా రూ.11,304 కోట్లు వస్తాయని.. వెరసి లోటు రూ.21,552 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ లోటును ఎలా పూడ్చుకుంటాయనే వివరాలను మాత్రం డిస్కంలు వెల్లడించలేదని పేర్కొన్నారు. ‘‘ఈ ఆర్థికలోటు పూడ్చాలంటే కరెంటు ఛార్జీలను డిస్కంలు పెంచాల్సిన అవసరముంది. పెరుగుతున్న డీజిల్‌, ఇతర ఇంధన ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కరెంటు ఛార్జీలను సవరించాలని కేంద్రం కూడా ఆదేశాలిచ్చింది. అయితే ఛార్జీల సవరణ ప్రతిపాదనలను డిస్కంలు ఇప్పటివరకు ఇవ్వలేదు. దీంతో ఈఆర్‌సీ ఏ నిర్ణయం తీసుకోలేదు. ప్రతిపాదనలు ఇస్తే, వార్షిక ఆదాయ అవసరాల వివరాలను ప్రజల ముందు పెట్టి, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగంగా విచారించి మార్చి 31లోగా తుది ఆదేశాలు ఇవ్వగలం.’’ అని శ్రీరంగారావు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు