సాగు భూముల క్రయవిక్రయాల జోరు

రాష్ట్రంలో సాగు భూముల క్రయవిక్రయాలు జోరు మీదున్నాయి. నెలకు 60 వేలకు పైగా లావాదేవీలు నమోదవుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఖజానాకు రూ.939.98 కోట్ల రాబడి వచ్చింది. ఈ ఏడాది కరోనా

Updated : 04 Dec 2021 06:13 IST

జులై నుంచి భారీగా పెరిగిన ఆదాయం
ఇప్పటివరకు రూ.939 కోట్ల రాబడి
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో సాగు భూముల క్రయవిక్రయాలు జోరు మీదున్నాయి. నెలకు 60 వేలకు పైగా లావాదేవీలు నమోదవుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఖజానాకు రూ.939.98 కోట్ల రాబడి వచ్చింది. ఈ ఏడాది కరోనా కారణంగా మే నెలలో కనిష్ఠ స్థాయికి ఆదాయం పడిపోయినప్పటికీ తరువాత పుంజుకుంది. ఏప్రిల్‌ నుంచి రాబడిని గమనిస్తే నెలకు సగటున రూ.117 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరుతోంది.

జులైలో గరిష్ఠ ఆదాయం
రాష్ట్రంలో వ్యవసాయ భూముల క్రయవిక్రయాలను ప్రభుత్వం ధరణి పోర్టల్‌ ద్వారా నిర్వహిస్తోంది. గతేడాది నవంబరు 2న పోర్టల్‌ ప్రారంభమైంది. మీ సేవా కేంద్రాల ద్వారా స్లాట్లు నమోదు చేసుకుని తహసీల్దారు-సంయుక్త సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, గిఫ్ట్‌డీడ్‌, వారసత్వ బదిలీ, జీపీఏ తదితర లావాదేవీలను పూర్తి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రాష్ట్రంలో 594 తహసీల్దారు కార్యాలయాలు ఉండగా 574 చోట్ల ధరణి రిజిస్ట్రేషన్ల సేవలు అందుబాటులోకి తెచ్చారు. దీనికితోడు ఈ ఏడాది సెప్టెంబరు నుంచి సర్వే నంబర్ల వారీగా భూముల ధరలను అమలు చేస్తుండటంతో ఆదాయం పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా జులైలో రూ.156.44 కోట్ల రాబడి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని