పోలీసులకు అందివచ్చిన కృత్రిమ మేధ

నేర పరిశోధనల్లో హైదరాబాద్‌ పోలీసులు కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)ను వినియోగించడం ద్వారా చక్కటి ఫలితాలు సాధిస్తున్నారు. క్లిష్టమైన కేసులను సులువుగా పరిష్కరించగలుగుతున్నారు. గతేడాది నమోదైన కేసుల్లో ఈ

Published : 15 Jan 2022 03:58 IST

ఈనాడు, హైదరాబాద్‌: నేర పరిశోధనల్లో హైదరాబాద్‌ పోలీసులు కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)ను వినియోగించడం ద్వారా చక్కటి ఫలితాలు సాధిస్తున్నారు. క్లిష్టమైన కేసులను సులువుగా పరిష్కరించగలుగుతున్నారు. గతేడాది నమోదైన కేసుల్లో ఈ విధానం ద్వారా 20 శాతం ఛేదించి, నిందితులను అరెస్ట్‌ చేశారు.  కిందటి సంవత్సరం 13,028 కేసులు నమోదైతే... 2,600 కేసుల్లో కీలక ఆధారాలను ఏఐ సమకూర్చడం విశేషం. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లోని క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ సపోర్ట్‌ సెంటర్‌ ఈ క్రతువులో కీలక పాత్ర పోషిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. రాజధానిలో ఎక్కడ.. ఎలాంటి నేరం జరిగినా ఆ సమాచారాన్ని ఈ కేంద్రానికి చేరవేస్తే చాలు.. ఘటనను విశ్లేషించి ఫలానా నేరస్థులు చేసుంటారన్న సమాచారం ఇస్తుంది. నిత్యం వందలాది కేసులను ఇక్కడ విశ్లేషిస్తున్నారు. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)కు పెరగనున్న ప్రాధాన్యం దృష్ట్యా బంజారాహిల్స్‌లో నిర్మిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ఏఐ కేంద్రంలో నేరాలు, నేరస్థుల సమగ్ర సమాచారం పొందుపరిచారు. 60-70 ఏళ్ల వివరాలు కూడా ఉంటాయి. తాజా నేరాన్ని నమోదు చేయగానే శాస్త్రీయ, తార్కిక కోణంలో విశ్లేషించి అందులో ప్రమేయం ఉండొచ్చని భావించే వారి వివరాలను వెంటనే తెలియజేస్తుంది. ఉదాహరణకు ఒక చోరీ కేసును నమోదు చేస్తే గత పదేళ్లలో ఎన్ని నమోదయ్యాయి? దొంగలను పట్టుకున్నారా? లేదా? ఏ ముఠా సభ్యులు చేసే అవకాశాలున్నాయో వివరిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని