దిల్లీ మార్కెట్‌లో బాంబు,పాక్‌ సరిహద్దులో ఐఈడీ

గణతంత్ర దినోత్సవానికి కొద్ది రోజుల ముందు దేశంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో పేలుడు పదార్ధాలను గుర్తించడం కలకలం రేపింది. భద్రత సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం దిల్లీలోని గాజీపుర్‌

Updated : 15 Jan 2022 06:04 IST

ఒకే రోజు మూడు ఘటనలతో కలకలం

దిల్లీ: గణతంత్ర దినోత్సవానికి కొద్ది రోజుల ముందు దేశంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో పేలుడు పదార్ధాలను గుర్తించడం కలకలం రేపింది. భద్రత సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం దిల్లీలోని గాజీపుర్‌ పూలమార్కెట్‌లో బాంబు లభ్యమైంది. స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన దిల్లీ పోలీసులు.. బాంబ్‌స్క్వాడ్‌, ఎన్‌ఎస్‌జీని రంగంలోకి దించారు. బాంబును స్వాధీనం చేసుకొని  అందులో ఐఈడీని పూడ్చి పేల్చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.  మరోవైపు పంజాబ్‌లో ఐదు కేజీల ఐఈడీ పట్టుబడింది. డ్రగ్స్‌ ఉన్నాయన్న సమాచారంతో అట్టారీ-వాఘా సరిహద్దుకు వెళ్లిన పోలీసులకు.. ఐఈడీ కనిపించింది.  ఇవి పాకిస్థాన్‌ నుంచే వచ్చాయని అమృత్‌సర్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏఐజీ రశ్‌పాల్‌ సింగ్‌ తెలిపారు. జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్‌ ఖవ్జాబజార్‌లో ప్రెషర్‌ కుక్కర్‌లో అమర్చిన గ్రెనేడ్‌ను పోలీసులు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని