AP News: నేటి నుంచి ఏపీలో రాత్రి కర్ఫ్యూ అమలు

ఏపీలో మంగళవారం రాత్రి నుంచి కర్ఫ్యూ నిబంధనలు అమలులోకి రానున్నాయి. 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమలుచేయనున్నారు. వివాహాలు, మతపరమైన, సామాజిక కార్యక్రమాలను బహిరంగ

Updated : 18 Jan 2022 07:07 IST

రాత్రి 11 నుంచి ఉ. 5 గంటల వరకూ

ఈనాడు, అమరావతి: ఏపీలో మంగళవారం రాత్రి నుంచి కర్ఫ్యూ నిబంధనలు అమలులోకి రానున్నాయి. 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమలుచేయనున్నారు. వివాహాలు, మతపరమైన, సామాజిక కార్యక్రమాలను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహిస్తే గరిష్ఠంగా 200 మంది, హాళ్లలో అయితే 100 మందే హాజరుకావాలి. అంతర్‌రాష్ట్ర, రాష్ట్ర సరకు రవాణా వాహనాలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది.

4,108 మందికి పాజిటివ్‌..

ఏపీలో ఆదివారం ఉదయం 9 నుంచి సోమవారం ఉదయం 9 గంటల మధ్య 22,882 నమూనాలను పరీక్షించగా... 4,108 కేసులు బయటపడ్డాయి. దీంతో పాజిటివిటీ రేటు 17.95%గా నమోదైంది. ఈ నెల 1న పాజిటివిటీ రేటు 0.57%గా నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని