జీవో 317ను రద్దు చేయండి

జీవో 317ను రద్దు చేసి న్యాయం చేయాలంటూ కోరుతూ పలువురు ఉపాధ్యాయులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సోమవారం వినతిపత్రం అందజేశారు. మంత్రి ఇంటి ఎదుట ఉమ్మడి రంగారెడ్డి,

Published : 18 Jan 2022 03:53 IST

మంత్రి సబితారెడ్డికి వినతి

ఆందోళన చేస్తున్న గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు

ఖైరతాబాద్‌, శ్రీనగర్‌కాలనీ, న్యూస్‌టుడే: జీవో 317ను రద్దు చేసి న్యాయం చేయాలంటూ కోరుతూ పలువురు ఉపాధ్యాయులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సోమవారం వినతిపత్రం అందజేశారు. మంత్రి ఇంటి ఎదుట ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌, వరంగల్‌ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. పది మందిని మాత్రమే లోపలికి అనుమతించడంతో మిగిలినవారు రోడ్డుపై బైఠాయించారు. వారిని పోలీసులు ఠాణాకు తరలించారు.

మంత్రి సబితారెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న ఉపాధ్యాయులు

దంపతుల్ని ఒకేచోట ఉంచండి

దంపతులైన ఉద్యోగుల్ని ఒకేచోట ఉండేలా చూస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చాలని పలువురు ఉపాధ్యాయులు కోరారు. పలు జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు సోమవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. స్పౌజ్‌ విషయంలో ముఖ్యమంత్రి ఒకలా స్పందిస్తే, అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించారన్నారు.


జోనల్‌ కేటాయింపుల్లో తప్పులు సరిచేయండి  

ఈనాడు, హైదరాబాద్‌: ఎంపిక చేసుకున్న జోన్లకు కాకుండా ఇతర జోన్లకు కేటాయించడం సరికాదని, జోనల్‌ కేటాయింపుల్లో తప్పులు సరిచేయాలంటూ గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు సోమవారం బీఆర్కే భవన్‌ వద్ద ఆందోళన నిర్వహించారు. తొలుత ఎంపిక చేసుకున్న బహుళ జోన్లకే తమను కేటాయించాలని వారు కోరారు. ఆందోళన నిర్వహించిన వారిని పోలీసులు అరెస్టు చేసి సమీప ఠాణాలకు తరలించారు.

‘ఉపాధ్యాయుల అరెస్టు అప్రజాస్వామికం’

విద్యాశాఖ మంత్రి ఇంటికి, బీఆర్కే భవన్‌కు వెళ్లిన ఉపాధ్యాయులను అరెస్టు చేసి రోజంతా పోలీస్‌స్టేషన్లలో ఉంచడం అప్రజాస్వామికమని తెలంగాణ రాష్ట్ర యూటీఎఫ్‌ అధ్యక్షుడు కె.జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావా రవి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని