8-10 తరగతులకు ఆన్‌లైన్‌ బోధన

రాష్ట్రంలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధన చేపట్టేందుకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన శనివారం ఆదేశాలు జారీ చేశారు. కరోనా పరిస్థితుల కారణంగా సెలవులను ఈనెల 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం

Published : 23 Jan 2022 05:04 IST

 24 నుంచి 50 శాతం సిబ్బంది విధులకు వెళ్లాలి

పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధన చేపట్టేందుకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన శనివారం ఆదేశాలు జారీ చేశారు. కరోనా పరిస్థితుల కారణంగా సెలవులను ఈనెల 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో విద్యాశాఖ ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు ఆయా యాజమాన్యాలకు అనుమతి ఇచ్చింది. సర్కారు బడుల్లో కూడా ఆన్‌లైన్‌ తరగతులు(టీవీ పాఠాలు) ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈనెల 24 నుంచి 50 శాతం మంది బోధన, బోధనేతర సిబ్బంది విధులకు హాజరుకావాలని పేర్కొంది. సగం మంది ఒకరోజు, మిగిలిన సగం మంది మరో రోజు పాఠశాలలకు హాజరుకావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని