దిగివస్తున్న కొవిడ్‌ ‘ఆర్‌-వాల్యూ’

దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో.. ఐఐటీ మద్రాస్‌ కాస్త ఊరటనిచ్చే కబురు చెప్పింది. వైరస్‌ వ్యాప్తి తీరును సూచించే ‘ఆర్‌-వాల్యూ’ ఈ వారం (జనవరి 14-21)లో 1.57కి తగ్గినట్లు వెల్లడించింది. అయితే రానున్న రెండు

Updated : 24 Jan 2022 04:43 IST

1.57కి తగ్గుముఖం..
రెండు వారాల్లో గరిష్ఠ స్థాయికి మూడో వేవ్‌
ఐఐటీ మద్రాస్‌ తాజా విశ్లేషణ

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో.. ఐఐటీ మద్రాస్‌ కాస్త ఊరటనిచ్చే కబురు చెప్పింది. వైరస్‌ వ్యాప్తి తీరును సూచించే ‘ఆర్‌-వాల్యూ’ ఈ వారం (జనవరి 14-21)లో 1.57కి తగ్గినట్లు వెల్లడించింది. అయితే రానున్న రెండు వారాల్లో కొవిడ్‌ మూడో ఉద్ధృతి (వేవ్‌) గరిష్ఠస్థాయికి చేరుతుందని విశ్లేషించింది. కొవిడ్‌ సోకిన ఒక వ్యక్తి నుంచి ఇతరులకు ఇన్‌ఫెక్షన్‌ ఏ స్థాయిలో వ్యాపిస్తుందో తెలిపేదే ఆర్‌-వాల్యూ. ఇది 1 కంటే తక్కువగా ఉంటే వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లు పరిగణిస్తారు.

ముంబయి, కోలకతాల్లో ఆర్‌-వాల్యూ వరుసగా 0.67, 0.56గా ఉంది. ఈ లెక్కన ఈ రెండు నగరాల్లో కొవిడ్‌ గరిష్ఠ దశ ముగిసినట్లేనని, ఇక్కడ మహమ్మారి ‘ఎండమిక్‌’ స్థాయికి చేరిందని గణిత విభాగం అసిస్టెం్ ప్రొఫెసన్‌ డాక్టర్‌ జయంత్‌ ఝా తెలిపారు. కాగా చెన్నై (1.2), దిల్లీ (0.98)ల్లో ఆర్‌-వాల్యూ 1కి అటూ ఇటుగా ఉంది.

దేశంలో మూడో వేవ్‌ ఫిబ్రవరి 1-15 మధ్య గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉందని గతంలో అంచనా వేయగా.. తాజా విశ్లేషణలో ఫిబ్రవరి 6 వరకు గరిష్ఠ స్థితి ఉంటుందని పేర్కొన్నారు.

కొత్తగా 3,33,533 మందికి కొవిడ్‌..

దేశంలో వరుసగా నాలుగో రోజు (ఆదివారం) 3 లక్షలకు పైగా కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 3,33,533 మంది కరోనా బారిన పడగా.. 525 కొవిడ్‌ మరణాలు నమోదయ్యాయి. క్రియాశీలక కేసుల సంఖ్య 21,87,205 (5.57%)కు పెరిగింది. మొత్తం కేసుల సంఖ్య 3,92,37,264కి చేరగా.. ఇంతవరకు 4,89,409 మందిని మహమ్మారి బలి తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని