TS News: విద్యా సంస్థలను తెరిచే యోచనలో ప్రభుత్వం..31 నుంచి ప్రత్యక్ష తరగతులు?

రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలను తెరిచి ప్రత్యక్ష తరగతులను నిర్వహించే దిశగా ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. కరోనా పరిస్థితుల కారణంగా ఈ నెల 30వ తేదీ వరకు....

Updated : 25 Jan 2022 06:59 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలను తెరిచి ప్రత్యక్ష తరగతులను నిర్వహించే దిశగా ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. కరోనా పరిస్థితుల కారణంగా ఈ నెల 30వ తేదీ వరకు సెలవులను పొడిగించి విద్యాసంస్థలను మూసివేసిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా సీరియస్‌ కేసులు లేకపోవడం, త్వరలోనే తగ్గుముఖం పట్టే అవకాశం కూడా ఉందని వైద్య ఆరోగ్యశాఖ అంతర్గతంగా అంచనాకు వస్తుండటంతో మళ్లీ ప్రత్యక్ష తరగతులను మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీలుంటే ఈ నెల 31వ తేదీ నుంచి, లేకుంటే మరో వారంపాటు సెలవులు పొడిగించి ఫిబ్రవరి రెండో వారం నుంచి తరగతులు ప్రారంభింపజేయాలని భావిస్తున్నారు. అయితే ప్రత్యక్ష తరగతులకు రావాలా? ఆన్‌లైన్‌ ఎంచుకోవాలా? అనేది తల్లిదండ్రులకు స్వేచ్ఛ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని