కొత్తగా 4,559 కొవిడ్‌ కేసులు

రాష్ట్రంలో కొత్తగా 4,559 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. 8 నెలల తర్వాత ఇంత భారీగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి.  మొత్తం బాధితుల సంఖ్య 7,43,354కు పెరిగింది. మహమ్మారి కోరల్లో చిక్కి మరో 2 మరణాలు సంభవించగా..

Published : 26 Jan 2022 03:57 IST

మరో రెండు మరణాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 4,559 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. 8 నెలల తర్వాత ఇంత భారీగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి.  మొత్తం బాధితుల సంఖ్య 7,43,354కు పెరిగింది. మహమ్మారి కోరల్లో చిక్కి మరో 2 మరణాలు సంభవించగా.. ఇప్పటి వరకూ 4,077 మంది మృతిచెందారు. తాజాగా 1,961 మంది కరోనాకు చికిత్స పొంది కోలుకోగా.. మొత్తంగా 7,03,008 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఈ నెల 25న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 36,269 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,13,670 నమూనాలను పరీక్షించగా.. మొత్తం పరీక్షల సంఖ్య 3,15,89,602కు పెరిగింది. రాష్ట్రంలో మరో 3,23,614 కొవిడ్‌ టీకా డోసులను పంపిణీ చేశారు.

ఏపీలో కొత్తగా 13,819 కేసులు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 13,819 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేట్‌ 29.44%గా నమోదైంది. 12మంది మరణించారు. మంగళవారం ఉదయం 9 నుంచి బుధవారం ఉదయం 9గంటల మధ్య 46,929 నమూనాలు పరీక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని