నాలుగు జిల్లాల్లో తలసేమియా ముప్పు

జన్యుపరమైన భయంకర వ్యాధి బీటా తలసేమియా కేసులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయి. 31 జిల్లాల్లో ఈ జబ్బుతో బాధపడుతున్నవారు ఉన్నట్లు జీనోమ్‌ ఫౌండేషన్‌ అధ్యయనంలో తేలింది. రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, ఖమ్మంలను అధిక ముప్పు

Published : 26 Jan 2022 05:58 IST

5 సామాజిక వర్గాల్లో అధికంగా బాధితులు
జీనోమ్‌ ఫౌండేషన్‌ అధ్యయనం

ఈనాడు, హైదరాబాద్‌: జన్యుపరమైన భయంకర వ్యాధి బీటా తలసేమియా కేసులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయి. 31 జిల్లాల్లో ఈ జబ్బుతో బాధపడుతున్నవారు ఉన్నట్లు జీనోమ్‌ ఫౌండేషన్‌ అధ్యయనంలో తేలింది. రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, ఖమ్మంలను అధిక ముప్పు ఉన్న జిల్లాలుగా గుర్తించారు. 48 సామాజిక వర్గాల్లో ఈ వ్యాధితో బాధపడుతున్నవారు ఉన్నారని.. ప్రత్యేకించి 5 సామాజికవర్గాల్లో అత్యధికంగా 69 శాతం మంది ఉన్నట్లు వీరి పరిశోధనలో తేలింది. పరిశోధన ఫలితాలు హీమోగ్లోబిన్‌ అనే అంతర్జాతీయ పత్రికలో ప్రచురితమయ్యాయి. అరుదైన వ్యాధులపై ప్రజల్లో అవగాహన, నివారణ, తక్కువ ఖర్చుతో పరిష్కారాలను అందించే ఉద్దేశంతో నగరానికి చెందిన  సంస్థ జీనోమ్‌ ఫౌండేషన్‌..తలసేమియా, సికిల్‌ సెల్‌ సొసైటీ సహకారంతో విస్తృత పరిశోధనలు చేపట్టింది. ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటుతో ఏడాదిపాటు తలసేమియా రోగుల నుంచి వివరాలు సేకరించి క్రోడికరించారు. ‘‘రాష్ట్రంలో ఈ వ్యాధి నివారణకు.. పరీక్షలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. తలసేమియాతో పుట్టిన వ్యక్తి చికిత్స కోసం ప్రభుత్వం చేసే ఖర్చుతో పోలిస్తే నివారణకు వెచ్చించే ఖర్చు తక్కువే అవుతుంది’’ అని  జీనోమ్‌ ఫౌండేషన్‌ ప్రధాన శాస్త్రవేత్త వి.ఆర్‌.రావు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని