సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు

వచ్చే ఆర్థిక సంవత్సరానికి సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, ఇతర నిర్మాణాలకు రూ.30 వేల కోట్లకుపైనే బడ్జెట్‌ కేటాయింపులు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాళేశ్వరం పనులు చివరి దశకు చేరుకోవడంతో ఇతర ప్రాధాన్య ప్రాజెక్టులైన

Published : 28 Jan 2022 04:34 IST

రూ.30 వేల కోట్లకు పైనే?

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, ఇతర నిర్మాణాలకు రూ.30 వేల కోట్లకుపైనే బడ్జెట్‌ కేటాయింపులు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాళేశ్వరం పనులు చివరి దశకు చేరుకోవడంతో ఇతర ప్రాధాన్య ప్రాజెక్టులైన పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, దేవాదులతోపాటు మరికొన్నింటికి  కొంతమేర బడ్జెట్‌ పెంచే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. అయితే, కాళేశ్వరం ప్రాజెక్టు కింద డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ నిర్మాణానికి నిధులు ఎక్కువ అవసరమన్న అభిప్రాయం ఉంది. మరోవైపు కార్పొరేషన్లు, బ్యాంకుల ద్వారా అందుతున్న రుణాలపైనే ఆధారపడి ప్రధానమైన ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. చెక్‌డ్యాంల నిర్మాణం, ప్రధాన ప్రాజెక్టుల కింద కాల్వల వ్యవస్థ, భూసేకరణ తదితర అవసరాలను పరిగణనలోకి తీసుకుని ముఖ్య ఇంజినీర్లు దాదాపు రూ.50 వేల కోట్లతో అంచనాలను రూపొందించి నీటిపారుదలశాఖకు అందజేశారు. ప్రాధాన్యత అంశాలను పరిగణనలోకి తీసుకుని తుది అంచనాలను ఆ శాఖ.. ఆర్థిక శాఖకు పంపినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని