సమ్మెకు పెరుగుతున్న మద్దతు

ఆంధ్రప్రదేశ్‌లోఉద్యోగుల  ఆందోళనలు ఉద్ధృతం అవుతున్నాయి. సమ్మెకు అన్ని సంఘాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ, వైద్య-ఆరోగ్య శాఖల ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి.

Published : 29 Jan 2022 04:05 IST

సై అన్న ఏపీఎస్‌ఆర్టీసీ, వైద్య, ఆరోగ్య శాఖల ఉద్యోగులు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోఉద్యోగుల  ఆందోళనలు ఉద్ధృతం అవుతున్నాయి. సమ్మెకు అన్ని సంఘాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ, వైద్య-ఆరోగ్య శాఖల ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఉద్యమానికి సంఘీభావంగా ఫిబ్రవరి 1, 2 తేదీల్లో అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఉద్యమ కార్యాచరణలో భాగంగా పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఈనెల 30 వరకు ర్యాలీలు, రిలే నిరాహార దీక్షలు కొనసాగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఉద్యోగులు రిలే దీక్షలు చేశారు. కొన్ని జిల్లాల్లో పీఆర్సీ సాధన సమితి రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. నెల్లూరులో జరిగిన దీక్షలకు ఉద్యోగినులు భారీగా హాజరయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫిబ్రవరి 3న నిర్వహించే ‘చలో విజయవాడ’ను విజయవంతం చేసేందుకు సాధన సమితి సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని బీఆర్టీఎస్‌ రోడ్డులో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందితో సభ నిర్వహించాలని పట్టుదలతో ఉన్నారు. ఇదేసమయంలో పాత జీతాలే చెల్లించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా డీడీవోలకు ఉద్యోగులు లక్షలాది అభ్యర్థన పత్రాలను సమర్పించారు. ఎస్జీటీ ఉపాధ్యాయులు ఎంఈవోలకు, స్కూల్‌ అసిస్టెంట్లు ప్రధానోపాధ్యాయులకు పత్రాలను ఇచ్చారు.

‘చర్చలకు సిద్ధమని ఉద్యోగులు పిలిస్తేనే వస్తాం’

పీఆర్‌సీలో అభ్యంతరాలపై ఉద్యోగ సంఘాలతో చర్చించడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఇక వారి కోసం వేచి చూడదని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. చర్చలకు సిద్ధమని ఉద్యోగులు పిలిస్తేనే వస్తామని శుక్రవారం వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని