Telangana News: ఏప్రిల్‌ 1 నుంచి విద్యుత్‌ కొత్త ఛార్జీలు!

విద్యుత్తు సంస్కరణలపై మార్చి 31వ తేదీలోపు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌(ఈఆర్‌సీ) తుది తీర్పు వెలువరిస్తుందని, ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి విద్యుత్‌ కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయని కమిషన్‌ ఛైర్మన్‌ శ్రీరంగారావు తెలిపారు. ఇటీవల ఈఆర్‌సీ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో

Updated : 01 Mar 2022 09:26 IST

‘ఈటీవీ’తో ఈఆర్‌సీ చైర్మన్‌ శ్రీరంగారావు
రైతులు 24 గంటల విద్యుత్తు అవసరం లేదని చెప్పినట్టు వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్తు సంస్కరణలపై మార్చి 31వ తేదీలోపు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌(ఈఆర్‌సీ) తుది తీర్పు వెలువరిస్తుందని, ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి విద్యుత్‌ కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయని కమిషన్‌ ఛైర్మన్‌ శ్రీరంగారావు తెలిపారు. ఇటీవల ఈఆర్‌సీ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బహిరంగ విచారణ జరిపిందని, ఈ సందర్భంగా అనేక అనేక ఆసక్తికర అంశాలు తమ దృష్టికి వచ్చాయన్నారు. సోమవారం ఆయన లక్డీకాపూల్‌లోని తన కార్యాలయంలో ‘ఈటీవీ’తో మాట్లాడారు. ‘డిస్కంలు వేస్తున్న అభివృద్ధి ఛార్జీలపై వినియోగదారుల నుంచి అనేక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వాటిపై డిస్కంలు వివరణ ఇచ్చాయి. తమకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అవసరం లేదని రైతులు చెప్పారు. పరిశ్రమలు, మెట్రో సిటీలకు పీక్‌లోడ్‌ విద్యుత్తును అందించే సమయంలో (సాయంత్రం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు) విద్యుత్తు సరఫరా లేకున్నా అభ్యంతరం లేదని రైతులు బహిరంగ విచారణలో చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు రాయితీలు చెల్లించడం లేదనే ఆరోపణల్లో వాస్తవం లేదు. ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్‌ ఛార్జీల బకాయిలు భారీగా పేరుకుపోయిన విషయం మాత్రం వాస్తవమే. వీటిని చెల్లింపులు జరిపే అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళతాం’ అని ఆయన వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని