Heavy Rain: 3 గంటల్లో.. ముంచేసింది

కుండపోతతో గురువారం రాత్రి రాజధాని వణికిపోయింది. రాత్రి 7.30-10.30 గం. మధ్య  10 సెం.మీ. వర్షం పడటంతో ఊహించని నష్టం వాటిల్లింది. కాలనీలు, రహదారులు నదులను తలపించాయి. రోడ్లన్నీ మునిగిపోయాయి. వాహనాలు పడవల్లా తేలాయి.

Updated : 03 Sep 2021 06:17 IST

హైదరాబాద్‌లో 10 సెం.మీ. వాన
పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ మునక
కొన్నిచోట్ల కొట్టుకుపోయిన వాహనాలు

ఈనాడు, హైదరాబాద్‌: కుండపోతతో గురువారం రాత్రి రాజధాని వణికిపోయింది. రాత్రి 7.30-10.30 గం. మధ్య  10 సెం.మీ. వర్షం పడటంతో ఊహించని నష్టం వాటిల్లింది. కాలనీలు, రహదారులు నదులను తలపించాయి. రోడ్లన్నీ మునిగిపోయాయి. వాహనాలు పడవల్లా తేలాయి. కొన్నిచోట్ల కొట్టుకుపోయాయి. మెహిదీపట్నం, రాజేంద్రనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, అమీర్‌పేట, కూకట్‌పల్లి, మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌, శ్రీనగర్‌కాలనీ, యూసఫ్‌గూడ ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టించింది. అమీర్‌పేట మైత్రివనం వద్ద కార్లు నీట మునిగాయి. మూసాపేట, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌ ప్రాంతాల్లో వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. చాంద్రాయణగుట్ట నుంచి బండ్లగూడ వెళ్లే దారిపై వరద చేరి రాకపోకలు నిలిచాయి. నిజాంపేట, మియాపూర్‌, బోరబండ, అల్లాపూర్‌ డివిజన్‌ వివేకానందనగర్‌ కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. కృష్ణానగర్‌లో తోపుడుబండ్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. ఓ వ్యక్తిని వరద నుంచి స్థానికులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది కాపాడారు. ట్రాఫిక్‌ సమస్య రాత్రి 11 గంటల వరకు ఉంది. ఎల్బీనగర్‌ నుంచి బయల్దేరిన వాహనాలు కూకట్‌పల్లి చేరుకునేందుకు రెండున్నర గంటలు పట్టింది. జూబ్లీహిల్స్‌ ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ప్రాంతంలో గరిష్ఠగా 9.78 సెం.మీ. వర్షం పడింది.

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని