Updated : 27/11/2021 06:41 IST

వలస జీవికి ఎంత కష్టం.. కాలి నడకన హైదరాబాద్‌ నుంచి అస్సాంకు పయనం

అధిక వేతనం ఆశపెట్టి కూలీని మోసగించిన మేస్త్రీ

భువనేశ్వర్‌: పొట్ట చేతపట్టుకుని అస్సాం నుంచి సుదూరంలోని హైదరాబాద్‌కు వలస వచ్చిన ఓ కూలీ మేస్త్రీ మోసం చేయటంతో పెద్ద సాహసం తలపెట్టాడు. చేతిలో చిల్లిగవ్వ లేక కాలినడకన సొంత రాష్ట్రానికి పయనమయ్యాడు. మూడు నెలలుగా 650 కిలోమీటర్లు నడిచాడు. దారిలో బిచ్చమెత్తుకుని కడుపు నింపుకొన్నాడు. ఏదీ దొరకనిరోజు మంచి నీళ్లతో సరిపెట్టుకున్నాడు. చివరకు శుక్రవారం ఒడిశాలోకి ప్రవేశించాడు. కొరాపుట్‌ జిల్లాలోని లక్ష్మీపుర్‌లో గువాహటికి ఎలా వెళ్లాలంటూ స్థానికులను అడుగుతుండగా.. నరేంద్ర అనే సామాజిక కార్యకర్త చూసి వివరాలు కనుక్కున్నారు. తన పేరు అజయ్‌ బోడులే అని, అస్సాంలోని నవ్‌గావ్‌ జిల్లాకు చెందినవాడినని చెప్పాడు. కూలీ ఎక్కువ వస్తుందని ఓ మేస్త్రీ చెప్పడంతో నమ్మి.. హైదరాబాద్‌ చేరుకుని భవన నిర్మాణ పనుల్లో చేరానని చెప్పాడు. ఆ మేస్త్రీ ఆకస్మాత్తుగా కనిపించకుండాపోయాడని, మూడు రోజులైనా.. అతని ఆచూకీ లేకపోవటం, వేతనం కూడా చెల్లించకపోవటంతో మోసపోయినట్లు అర్థమైందని చెప్పాడు. ఎవరిని అడగాలో తెలియక, సాయం చేసే వారు లేక సొంతూరికి వెళ్లిపోవాలనుకుంటున్నానని చెప్పాడు. చేతిలో డబ్బులు లేక కాళ్లనే నమ్ముకున్నానని, మూడు నెలల క్రితం నడక ప్రారంభించానని తెలిపాడు. అతడి దుస్థితికి చలించిపోయిన సామాజిక కార్యకర్త ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టారు. సమీపంలో రైల్వే పనుల్లో కొంతమంది అస్సాం కూలీలు పని చేస్తున్నారని తెలుసుకుని.. అజయ్‌ను వారి వద్దకు తీసుకెళ్లారు. వారు అతనికి పని ఇచ్చి తమతో ఉంచుకోడానికి అంగీకరించారు. కొంతకాలం వారితో కలిసి పనిచేయాలని అజయ్‌ నిర్ణయించుకున్నాడు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని