TS News: 2022లో 28 సాధారణ సెలవులు

తెలంగాణలో 2022 సంవత్సరంలో సాధారణ, ఐచ్ఛిక, వేతనంతో కూడిన సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో నంబరు 2618, 2619) జారీ చేసింది.

Updated : 27 Nov 2021 10:22 IST

ఐచ్చిక సెలవులు 23..  వేతనంతో కూడినవి 23

ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

ఈనాడు - హైదరాబాద్‌

తెలంగాణలో 2022 సంవత్సరంలో సాధారణ, ఐచ్ఛిక, వేతనంతో కూడిన సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో నంబరు 2618, 2619) జారీ చేసింది. ఆదివారం, రెండో శనివారాలు కలిపి ప్రభుత్వ కార్యాలయాలకు 28 రోజులను సాధారణ సెలవులుగా, మరో 23 రోజులను ఐచ్ఛిక సెలవులుగా ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వేతనంతో కూడిన సెలవులను (నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌) 23గా నిర్ధారిస్తున్నట్లు శుక్రవారం ఉత్వర్వుల్లో పేర్కొంది.


* రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ సెలవులు గాక అయిదు ఐచ్ఛిక సెలవులను ఉన్నతాధికారుల అనుమతితో పొందవచ్చని ప్రభుత్వం పేర్కొంది.

* రాష్ట్రంలోని పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు, విద్యాసంస్థలు, ప్రజాపనుల శాఖలకు ఈ ఉత్తర్వులు వర్తించవని, వాటికి సెలవులపై విడిగా ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని