Updated : 09/11/2021 07:14 IST

KTR: సోనూ రాజకీయాల్లోకి వస్తారని భయపడ్డారు: కేటీఆర్‌

హైసియా ప్రతినిధులను సన్మానిస్తున్న మంత్రి కేటీఆర్‌, నటుడు సోనూసూద్‌. పక్కన జయేశ్‌ రంజన్‌

మాదాపూర్‌, న్యూస్‌టుడే: మంచి పని మొదలు పెట్టినప్పుడు విమర్శలు, సవాళ్లు తప్పవని.. వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే అనుకున్నది చేయగలమని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో సోమవారం తెలంగాణ సోషల్‌ ఇంపాక్ట్‌ గ్రూప్‌ (టీఎస్‌ఐజీ) ఆధ్వర్యంలో కొవిడ్‌ వారియర్స్‌కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. 12 కార్పొరేట్‌ సంస్థలు, 26 ఎన్‌జీవోలు, 29 మంది సమాజ సేవకులు, 6 సమన్వయ సంస్థల ప్రతినిధులకు మంత్రి కేటీఆర్‌, సినీనటుడు సోనూసూద్‌ల చేతుల మీదుగా జ్ఞాపికలను అందించి సన్మానించారు. కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘కొవిడ్‌ సమయంలో నిస్వార్థ సేవతో సోనూసూద్‌ ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఏదైనా మంచి పని మొదలుపెట్టినప్పుడు పేరు కోసం చేస్తున్నారని, దీని వెనుక ఇంకేదో ఉందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తారు. చివరికి వ్యక్తిత్వాన్ని కూడా కించపరిచే ప్రయత్నం చేస్తారు. సోనూసూద్‌కు ఇదే జరిగింది. ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఎక్కడ తమకు నష్టం చేస్తారోననే ఉద్దేశంతో ఐటీ, ఈడీ దాడులు చేయించి భయపెట్టాలని చూశారు. సోనూ నిజమైన హీరో. ఆయన వెంట మేమంతా ఉన్నాం ’’ అని పేర్కొన్నారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని