కాంగ్రెస్‌లో విస్తృత సంస్కరణలు అవసరం

కాంగ్రెస్‌ క్రియాశీలకంగా ఉందని చాటడానికి అన్ని స్థాయుల్లో విస్తృత సంస్కరణలు చేపట్టాల్సిన అవసరముందని ఆ పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ అభిప్రాయపడ్డారు. అప్పుడే భాజపాకు ఆచరణాత్మక రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదగడం సాధ్యమని పేర్కొన్నారు. ఆదివారం ఆయన పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ పార్టీపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుతం భాజపాకు గట్టి ప్రత్యామ్నాయం లేదని అంగీకరిస్తూనే,

Published : 14 Jun 2021 04:46 IST

కపిల్‌ సిబల్‌

దిల్లీ: కాంగ్రెస్‌ క్రియాశీలకంగా ఉందని చాటడానికి అన్ని స్థాయుల్లో విస్తృత సంస్కరణలు చేపట్టాల్సిన అవసరముందని ఆ పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ అభిప్రాయపడ్డారు. అప్పుడే భాజపాకు ఆచరణాత్మక రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదగడం సాధ్యమని పేర్కొన్నారు. ఆదివారం ఆయన పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ పార్టీపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుతం భాజపాకు గట్టి ప్రత్యామ్నాయం లేదని అంగీకరిస్తూనే, ప్రధాని మోదీ పాలించే నైతిక హక్కును కోల్పోయారని సిబల్‌ వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజల ప్రస్తుత మానసిక స్థితికి అనుగుణంగా కాంగ్రెస్‌ ప్రత్యామ్నాయంగా ఎదగగలదని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై విశ్లేషించేందుకు పార్టీ కమిటీలను ఏర్పాటు చేయడం మంచి పరిణామమే అని, అవి సూచించిన పరిష్కార మార్గాలను పరిగణనలోకి తీసుకోకపోతే ప్రయోజనం ఉండదని అన్నారు. 2014 ఎన్నికల్లో లౌకికవాదానికి, మతతత్వానికి మధ్య పోటీగా ప్రచారం చేయడంతో కాంగ్రెస్‌పై మైనారిటీ పక్షపాత ముద్రపడిందని, దీనివల్ల భాజపాకు లబ్ధి కలిగిందని సిబల్‌ చెప్పారు. మైనారిటీ, మెజారిటీ.. ఏ వర్గం మతతత్వమైనా దేశానికి సమాన స్థాయిలో ప్రమాదకరమని ప్రజలకు తెలియజేయడంలో కాంగ్రెస్‌ విఫలమైందని చెప్పారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అస్సాంలో ఏఐయూడీఎఫ్‌తో, పశ్చిమ బెంగాల్‌లో ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌తో కాంగ్రెస్‌ పొత్తు అనాలోచిత నిర్ణయమని సిబల్‌ పేర్కొన్నారు. యువ నేతలు పార్టీని వీడుతుండటంపై స్పందిస్తూ.. ‘అనుభవజ్ఞులకు, యువతరానికి మధ్య సమతూకం ఏర్పర్చడం అత్యవసరం’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని