మోదీ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు 

కొవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ మోదీ ప్రభుత్వం కనికరం లేకుండా ఇంధన ధరలు పెంచుతోందని వామపక్షాల నాయకులు మండిపడ్డారు. కార్పొరేట్‌ సంస్థల యజమానులను మరింత సంపన్నులుగా.. పేదలను నిరుపేదలుగా...

Updated : 20 Jun 2021 13:20 IST

ఇంధన ధరల పెంపుపై వామపక్షాల నిరసన

బషీర్‌బాగ్‌, న్యూస్‌టుడే: కొవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ మోదీ ప్రభుత్వం కనికరం లేకుండా ఇంధన ధరలు పెంచుతోందని వామపక్షాల నాయకులు మండిపడ్డారు. కార్పొరేట్‌ సంస్థల యజమానులను మరింత సంపన్నులుగా.. పేదలను నిరుపేదలుగా మారుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి మోదీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ధరల పెంపుపై కలిసివచ్చే పార్టీలతో దేశవ్యాప్తంగా ఉద్యమించనున్నట్లు వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ధరల పెంపుపై సీఎం కేసీఆర్‌ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. మోదీ పాలనలో దేశ ప్రతిష్ఠ అడుగంటుతోందన్నారు. నిరసనలో కె.రమ (సీపీఐఎంఎల్‌- న్యూడెమోక్రసీ), తాండ్ర కుమార్‌ (ఎంసీపీఐ), మురహరి (ఎస్‌యూసీఐ-సీ), ఎస్‌ఎల్‌ పద్మ (సీపీఐఎంఎల్‌- న్యూడెమోక్రసీ), సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు అజీజ్‌ పాషా, హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఈటీ నర్సింహా, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు బి.వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింహారావు, ఎస్‌.వీరయ్య తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని