పంజాబ్‌ సీఎంపై తిరుగుబావుటా

పంజాబ్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం మరింత ముదురుతోంది. ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌పై నలుగురు మంత్రులు, 32 మంది కాంగ్రెస్‌ శాసనసభ్యులు తిరుగుబావుటా ఎగరేశారు. 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన ముఖ్యమైన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో సీఎం విఫలమయ్యారనీ, ఆయనపై తమకు నమ్మకం లేదని మూకుమ్మడిగా ప్రకటించారు. మంత్రి తృప్త్‌ రాజీందర్‌ సింగ్‌ బజ్వా నివాసంలో మంగళవారం వీరంతా సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్ని నివేదిస్తామని బజ్వా విలేకరులకు చెప్పారు.

Updated : 25 Aug 2021 10:08 IST

నలుగురు మంత్రులు, 32 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల అసమ్మతి గానం

మరింత ముదురుతున్న సంక్షోభం

చండీగఢ్‌/ దిల్లీ: పంజాబ్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం మరింత ముదురుతోంది. ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌పై నలుగురు మంత్రులు, 32 మంది కాంగ్రెస్‌ శాసనసభ్యులు తిరుగుబావుటా ఎగరేశారు. 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన ముఖ్యమైన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో సీఎం విఫలమయ్యారనీ, ఆయనపై తమకు నమ్మకం లేదని మూకుమ్మడిగా ప్రకటించారు. మంత్రి తృప్త్‌ రాజీందర్‌ సింగ్‌ బజ్వా నివాసంలో మంగళవారం వీరంతా సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్ని నివేదిస్తామని బజ్వా విలేకరులకు చెప్పారు. పూర్తిస్థాయి ప్రక్షాళన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని, ఒకవేళ ముఖ్యమంత్రిని మార్చాల్సిన అవసరం ఉంటే అది వెంటనే చేయాలని అభిప్రాయపడ్డారు. కెప్టెన్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలని, ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని చెప్పారు.

సిద్ధూ సలహాదారులపై చర్యలు చేపట్టాలి

ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సిద్ధూ సలహాదారులపై పార్టీ ప్రయోజనాల రీత్యా చర్యలు చేపట్టాలని కొందరు మంత్రులు/ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. వీరంతా ముఖ్యమంత్రికి విధేయులుగా ముద్రపడ్డారు. మరికొద్ది నెలల్లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగాల్సిన తరుణంలో ఇలాంటి పోటాపోటీ పరిణామాలు చోటు చేసుకోవడం ప్రకంపనలు సృష్టించింది. హామీలను ముఖ్యమంత్రి నెరవేరుస్తారనే నమ్మకం తమకు లేదని అసంతృప్త మంత్రులు తేల్చిచెబుతున్నారు. అమరీందర్‌కు ఉద్వాసన పలికి పీసీసీ అధ్యక్షుడు సిద్ధూను సీఎం చేయాలని శాసనసభ్యుడు సూర్జిత్‌సింగ్‌ ధిమన్‌ డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని