కొత్త పార్టీకి అమరీందర్‌ సై

కాంగ్రెస్‌ నేతలు చాలామంది తనతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఎన్నికల సంఘం (ఈసీ) ఆమోదం తెలపగానే కొత్త పార్టీ పేరు, గుర్తు ప్రకటిస్తానని పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ తెలిపారు. నెల రోజుల కిందట సీఎం

Updated : 28 Oct 2021 10:25 IST

ఈసీ ఆమోదం తెలపగానే పేరు ప్రకటన
‘టచ్‌’లోనే కాంగ్రెస్‌ నేతలు : కెప్టెన్‌

చండీగఢ్‌: కాంగ్రెస్‌ నేతలు చాలామంది తనతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఎన్నికల సంఘం (ఈసీ) ఆమోదం తెలపగానే కొత్త పార్టీ పేరు, గుర్తు ప్రకటిస్తానని పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ తెలిపారు. నెల రోజుల కిందట సీఎం పదవి నుంచి వైదొలగాక.. బుధవారం తొలి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  పంజాబ్‌లో సరిహద్దు భద్రతాదళాల పరిధిని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. ‘మాతో కలిసి నడిచేందుకు చాలామంది నేతలు సిద్ధంగా ఉన్నారు. పేర్లు ఇప్పుడే చెప్పలేను. ఎందుకంటే.. ఇప్పటికే నా మద్దతుదారులను వేధిస్తున్నారు’ అని అమరీందర్‌ తెలిపారు.  భాజాపాతో పొత్తు ఉంటుందని తానెప్పుడూ చెప్పలేదని, స్థానాలు మాత్రం పంచుకుంటామన్నారు. అకాలీ చీలిక వర్గాలతో పొత్తు పెట్టుకుంటామన్నారు. పాకిస్థానీ జర్నలిస్టు అరూసా ఆలం తన ప్రభుత్వ హయాంలో పలుమార్లు తనను కలుసుకున్నారన్న ఆరోపణలపై అమరీందర్‌ మాట్లాడుతూ.. ‘గత పదహారేళ్లుగా ఆమెతో పలుమార్లు భేటీ అయ్యాను. మళ్లీ తప్పకుండా ఆహ్వానిస్తా. పంజాబ్‌లో ఇంతకు మించిన సమస్యలేం లేవా?’ అని ప్రశ్నించారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని