కేంద్ర మంత్రి షెకావత్‌పై బాబు ఏజెంట్ల ప్రభావం ఉందేమో?

‘అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంపై కేంద్ర మంత్రి షెకావత్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు ఏజెంట్లు సీఎం రమేష్‌, సుజనాచౌదరి ప్రభావం షెకావత్‌పై పనిచేసిందేమో? లేదా రాష్ట్రంలో భాజపా బలోపేతం కావాలనుకుంటుందేమో!

Published : 05 Dec 2021 04:31 IST

ఏపీ జలవనరుల మంత్రి అనిల్‌కుమార్‌

ఈనాడు, అమరావతి: ‘అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంపై కేంద్ర మంత్రి షెకావత్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు ఏజెంట్లు సీఎం రమేష్‌, సుజనాచౌదరి ప్రభావం షెకావత్‌పై పనిచేసిందేమో? లేదా రాష్ట్రంలో భాజపా బలోపేతం కావాలనుకుంటుందేమో! అందువల్లే ఏదో ఒక దాంట్లో అడ్వాంటేజ్‌ తీసుకోవాలనుకున్నారో’ అని ఏపీ సాగునీటిపారుదలశాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు. ‘అన్నమయ్య ప్రాజెక్టు సామర్థ్యం కంటే ఒకటిన్నరరెట్లు వరద వచ్చిందని ఆయనే(షెకావత్‌) చెప్పారు. మళ్లీ అందులోనే ప్రాజెక్టుకు ఉన్న అయిదు గేట్లలో ఒక్క గేటు తెరుచుకోకపోవడం వల్లే నష్టం జరిగిందనడంలో అర్థమేంటి? ఉత్తరాఖండ్‌లో 170మందికిపైగా వరదల్లో కొట్టుకుపోయారే! మరి అది అక్కడి భాజపా ప్రభుత్వ వైఫల్యమా?’ అని ధ్వజమెత్తారు. శనివారం ఆయన వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘కేంద్ర మంత్రి చెబితే అదే రబ్బరుస్టాంపు అన్నట్లుగా ఆ వ్యాఖ్యలను పట్టుకుని చంద్రబాబు రాష్ట్ర ప్రజలను తప్పుదారిపట్టించే ప్రయత్నం చేస్తున్నారు.  చంద్రబాబుకు పోలవరం ఏటీఎంగా మారిందని గతంలో ప్రధాని మోదీ అన్నారు కదా! దాన్నీ చంద్రబాబు అంగీకరిస్తున్నారా? అసలు అన్నమయ్య ప్రాజెక్టు స్పిల్‌వే మొత్తాన్ని మార్చాలని 2017లోనే డ్యాం సేఫ్టీ వారు నివేదిక ఇస్తే ఆయన పట్టించుకోనేలేదు. అప్పుడే కట్టి ఉంటే ఇప్పుడీ విపత్తు ఉండేది కాదు. ఇప్పుడు ఈ విపత్తుకు చంద్రబాబే కారణం ’అని మంత్రి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని