రాజకీయంగా ఎదుర్కోలేకే దుష్ప్రచారం

రాజకీయంగా ఎదుర్కోలేకనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, హైకోర్టు డిస్మిస్‌ చేసిన కేసులో తనపై ప్రసార మాధ్యమాల ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ‘‘విపక్ష పార్టీకి చెందిన ఒక మాజీ

Published : 27 Jan 2022 04:09 IST

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాజకీయంగా ఎదుర్కోలేకనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, హైకోర్టు డిస్మిస్‌ చేసిన కేసులో తనపై ప్రసార మాధ్యమాల ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ‘‘విపక్ష పార్టీకి చెందిన ఒక మాజీ మంత్రి, మాజీ ఎంపీలు మరికొందరు ఇందులో ఉన్నారు. వారి పేర్లను త్వరలోనే ఆధారాలతో బయటపెడతా’’ అని అన్నారు. బుధవారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండు అఫిడవిట్‌లు సమర్పించినట్లు వచ్చిన ఆరోపణలు పచ్చి అబద్ధాలు. దీనిపై విపక్ష పార్టీ నేతల అనుచరుడు దిల్లీలోని హైకోర్టుకు వెళ్లి కేసు వేశారు. ఆధారాలు లేనందున కోర్టు దానిని గత డిసెంబరు 15న డిస్మిస్‌ చేసింది. కొందరు నాపై కుట్ర చేస్తున్నారు. నన్ను ఎంతగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తే అంత బలపడతా. నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదాలతో మరింత భారీ మెజారిటీతో ఎన్నికల్లో గెలుస్తా’’ అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. బీసీ సామాజికవర్గ నేత మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి తగిన బుద్ధి చెబుతామని తెలంగాణ బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. బుధవారం ఆయన బీసీ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు.  

త్వరలో ఉద్యోగ నియామకాలు

త్వరలో తెలంగాణలో కొత్త ఉద్యోగ నియామకాల ప్రక్రియ మొదలవుతుందని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నియామకాలను విపక్షాలే అడ్డుకుంటున్నాయని ఆయన విమర్శించారు. తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం రాష్ట్ర కార్యాలయంలో, ఆబ్కారి కమిషనరేట్‌లో జరిగిన గణతంత్ర దిన వేడుకల్లో మంత్రి జాతీయ జెండాను ఎగురవేశారు. టీజీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మమత, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని