ఆర్‌ఎల్‌డీతో పొత్తు పెట్టుకోవాలనుకున్నాం

ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ సమీపిస్తున్నవేళ జాట్‌ సామాజికవర్గం ఓటర్లను తమ వైపునకు తిప్పుకొనేలా భాజపా పావులు కదుపుతోంది. కేంద్ర హోంమంత్రి, కమలదళం అగ్రనేత అమిత్‌ షా.. యూపీ జాట్‌ నేతలతో

Updated : 27 Jan 2022 05:26 IST

జయంత్‌ చౌధరీ తప్పుదోవ ఎంచుకున్నారు:  అమిత్‌ షా  

ఈనాడు, దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ సమీపిస్తున్నవేళ జాట్‌ సామాజికవర్గం ఓటర్లను తమ వైపునకు తిప్పుకొనేలా భాజపా పావులు కదుపుతోంది. కేంద్ర హోంమంత్రి, కమలదళం అగ్రనేత అమిత్‌ షా.. యూపీ జాట్‌ నేతలతో దిల్లీలో బుధవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జాట్‌లు ఎక్కువగా మొగ్గుచూపే రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డీ) పార్టీతో ఈ దఫా ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలని తాము భావించామని.. ఆ పార్టీ అధినేత జయంత్‌ చౌధరీ మాత్రం తప్పు తోవను ఎంచుకున్నారని సమావేశంలో షా పేర్కొన్నారు. జయంత్‌కు ఇప్పటికీ తమ తలుపులు తెరిచే ఉన్నాయన్న సంకేతాలిచ్చారు. భాజపా ఎంపీ పర్వేశ్‌ వర్మ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రి సంజీవ్‌ బల్యాన్‌ సహా సుమారు 200 మందికిపైగా జాట్‌ నాయకులు పాల్గొన్నారు.

2014 సార్వత్రిక ఎన్నికలు, 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ భాజపా అగ్రనేతలు జాట్‌ నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఆ వర్గం ఓటర్లు తమవైపు మొగ్గుచూపేలా చక్రం తిప్పారు. అదేతరహాలో ఇప్పుడు జాట్‌ నేతలతో షా వ్యూహాత్మక సమావేశం నిర్వహించారని విశ్లేషణలు వెలువడుతున్నాయి. సాగుచట్టాలపై పోరులో జాట్‌లు క్రియాశీలకంగా వ్యవహరించడం, యూపీలో సమాజ్‌వాదీ పార్టీతో ఆర్‌ఎల్‌డీ జట్టు కట్టడం వంటి పరిణామాలు భాజపాకు ఇబ్బందికరంగా మారిన సంగతి గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు