‘కాళేశ్వరం’ అవినీతి ఆరోపణలపై సీఎంఓ స్పందించాలి

సాగునీటి ప్రాజెక్టులపై వస్తున్న అవినీతి ఆరోపణలకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) స్పందించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సీఎంఓలోని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి తన కుమార్తె

Published : 29 Jan 2022 04:09 IST

సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: సాగునీటి ప్రాజెక్టులపై వస్తున్న అవినీతి ఆరోపణలకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) స్పందించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సీఎంఓలోని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి తన కుమార్తె వివాహాన్ని అత్యంత వైభవంగా ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో జరపడంపై మీడియాలో కథనాలు వస్తున్నాయన్నారు. ఈ అధికారిపై అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చి 48 గంటలు కావస్తున్నా ఇంతవరకూ ఆ శాఖను పర్యవేక్షిస్తున్న సీఎం కేసీఆర్‌ స్పందించకపోవడం సరికాదన్నారు. ఈ వ్యవహారంపై న్యూస్‌పోర్టల్‌ కథనం.. అందులో పేర్కొన్న ఆధారాలను పరిశీలిస్తే ఇది క్విడ్‌ప్రోకో వ్యవహారంగా అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై వాస్తవాలను తెలంగాణ సమాజానికి వెల్లడించాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు ఆ అధికారిని పోస్టింగ్‌కు దూరంగా ఉంచాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ఇతర అధికారులతో పాటు, ప్రభుత్వంలోని పెద్దలపై వచ్చిన అవినీతి ఆరోపణలపైనా విచారణ చేపట్టాలన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలను బ్లాక్‌ లిస్టులో పెట్టాలన్నారు. ఈ డిమాండ్లపై సీఎంగా మీరు స్పందించకుంటే మీ వ్యవహార శైలిని ప్రజలు అనుమానించే పరిస్థితి ఉందని రేవంత్‌ లేఖలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని