Updated : 12 Feb 2022 08:36 IST

Akhilesh Yadav: అఖిలేశ్‌ దూకుడుకు దళిత యువతి హత్య కేసుతో కళ్లెం!

ప్రధాన నిందితుడిగా ఎస్పీ నేత తనయుడు

ఉన్నావ్‌: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ భాజపాకు దీటుగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ దూకుడుకు రాజకీయ కళ్లెం పడిందని ప్రత్యర్థులు భావిస్తున్నారు. రెండు నెలల కిందట గల్లంతైన ఓ దళిత యువతి (22) శవం సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఫతే బహదూర్‌ సింగ్‌ ఆశ్రమ సమీపంలో బయటపడింది. ఆశ్రమం పక్కనే ఖాళీస్థలంలో కుళ్లిన దశలో ఉన్న శవాన్ని బయటికి తీసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజోల్‌ సింగ్‌ మాజీ మంత్రి ఫతే బహదూర్‌ కుమారుడే. శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ‘రిమాండులో ఉన్న నిందితుడు రాజోల్‌సింగ్‌ను విచారించాకే స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ (ఎస్‌వోజీ) యువతి శవాన్ని బయటకు తీసింది. వివాహేతర సంబంధాలు బెడిసికొట్టి ఇలా జరిగినట్టు కనిపిస్తోంది. విచారణ కొనసాగుతోంది. కేసులో నిందితులు మరెవరైనా ఉంటే వాళ్లను కూడా త్వరలో అరెస్టు చేస్తాం’ అని ఉన్నావ్‌ ఏఎస్పీ శశిశేఖర్‌ సింగ్‌ తెలిపారు. కుమార్తె అదృశ్యమైనప్పటి నుంచీ యువతి తల్లి రాజోల్‌ సింగ్‌పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈమె గత జనవరి 24న లఖ్‌నవూ ఎన్నికల ప్రచారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ వాహనానికి అడ్డుపడి ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు కేసు విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాగా, అదే రోజు పోలీసులు రాజోల్‌సింగ్‌ను అరెస్టు చేయడం గమనార్హం.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని