Andhra News: జూన్‌లో ఏపీ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ?

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన తర్వాతే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందని అధికార వైకాపా వర్గాల సమాచారం. ఉగాదికి కొత్త జిల్లాల ఏర్పాటును పూర్తి

Updated : 13 Feb 2022 07:13 IST

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన తర్వాతే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందని అధికార వైకాపా వర్గాల సమాచారం. ఉగాదికి కొత్త జిల్లాల ఏర్పాటును పూర్తి చేసి, అదే రోజు నుంచి నూతన పాలనను ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు ఇటీవల స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాలతోపాటు కొత్త మంత్రులు కూడా ఉగాదికే వస్తారన్న ప్రచారం సాగింది. ఈ నెల 18 లేదా 22న మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందని సామాజిక మాధ్యమాల్లోనూ విస్తృత ప్రచారం జరుగుతోంది. అందులో వాస్తవం లేదని, మే వరకు మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉండబోదని సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. జూన్‌ 8తో ప్రస్తుత మంత్రివర్గం ఏర్పాటై మూడేళ్లు పూర్తవుతుంది. అందువల్ల జూన్‌లో పునర్‌వ్యవస్థీకరణ ఉండే అవకాశం ఉండొచ్చని అంటున్నారు. జులై 8న వైకాపా ప్లీనరీని నిర్వహించనున్నారు. ప్లీనరీ నుంచి పూర్తిగా రాజకీయ కార్యకలాపాలను ముమ్మరంచేసే వ్యూహంలో పార్టీ ఉన్నట్లు సమాచారం. నూతన మంత్రుల రాకకు ముందుగా... ఇప్పటివరకు మిగిలిపోయిన నామినేటెడ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని