Assembly Elections 2022: మార్చి 10 తర్వాత బుల్‌డోజర్లు పనిచేస్తాయి: యూపీ సీఎం యోగి

‘రాష్ట్రంలోని బుల్‌డోజర్లు మొత్తం మరమ్మతులకు పంపాం. మార్చి 10 (ఓట్ల గణన) తర్వాత అన్నీ పనిచేస్తాయి’ అని ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని నేరగాళ్లపై

Updated : 19 Feb 2022 07:09 IST

మైన్‌పురీ: ‘రాష్ట్రంలోని బుల్‌డోజర్లు మొత్తం మరమ్మతులకు పంపాం. మార్చి 10 (ఓట్ల గణన) తర్వాత అన్నీ పనిచేస్తాయి’ అని ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని నేరగాళ్లపై తమ ప్రభుత్వం అనుసరించే వైఖరి గురించి చెబుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మైన్‌పురీ ఎన్నికల సభలో యోగి మాట్లాడారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బుల్‌డోజర్లకు పని చెబుతారా అని సమాజ్‌వాదీ పార్టీ నేత అడిగిన ప్రశ్నకు జవాబుగా తాను ఈ మాటలంటున్నట్లు వివరించారు. యంత్రాలకు కూడా విశ్రాంతి అవసరం కదా అన్నారు. అక్రమ ఆస్తుల విధ్వంసానికి తమ ప్రభుత్వం బుల్‌డోజర్లను వాడుతుందని చెప్పారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా కలుగుల్లో దాక్కొన్నవారంతా ఎన్నికల ప్రకటనతో బయటికొచ్చి అరుస్తున్నారని ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని