Telangana News: తెరాస ఎమ్మెల్యే నోట.. ముందస్తు ఎన్నికల మాట

‘కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలను అన్ని వర్గాల వారు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రి దిల్లీ వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం మనకు ఇబ్బందులు కలిగించే అవకాశముంది.. ఇబ్బందులు కలిగించినా ఎదుర్కోవడానికి ముందస్తు ఎన్నికలకు

Updated : 05 Mar 2022 08:20 IST

అయిజ, న్యూస్‌టుడే: ‘కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలను అన్ని వర్గాల వారు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రి దిల్లీ వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం మనకు ఇబ్బందులు కలిగించే అవకాశముంది.. ఇబ్బందులు కలిగించినా ఎదుర్కోవడానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. అందుకే పార్టీ బలోపేతం కావడానికి ఈ నెల 8న వనపర్తిలో సభ ఏర్పాటు చేశారు. దీనికి ప్రతి గ్రామం నుంచీ కార్యకర్తలు వచ్చి విజయవంతం చేయాలి’ అని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం పేర్కొనడం చర్చనీయాంశమైంది. జోగులాంబ గద్వాల జిల్లా అయిజలో శుక్రవారం రహదారి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన కార్యకర్తలనుద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని