పీజీ సీట్ల అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టండి

కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలల్లో పీజీ సీట్ల కేటాయింపులో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని సీపీఎం....

Updated : 23 Apr 2022 05:46 IST

ప్రభుత్వాన్ని కోరిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

ఈనాడు, హైదరాబాద్‌: కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలల్లో పీజీ సీట్ల కేటాయింపులో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. నీట్‌ కౌన్సెలింగ్‌లో యాజమాన్య కోటాలో మిగిలిన సీట్లను ప్రవాస భారతీయ(ఎన్‌ఆర్‌ఐ) సీటు కింద సుమారు రూ.2 కోట్లకు విక్రయిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉందని పేర్కొన్నారు. దీంతో అర్హులైన పేద, మధ్య తరగతి విద్యార్థులు సీట్లు రాక నష్టపోతున్నారన్నారు. ఈ వ్యవహారంపై వర్సిటీ ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన కళాశాలల గుర్తింపు రద్దు చేయడంతో పాటు ఆ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని