Teenmar Mallanna: ఇక నుంచి కేసీఆర్‌ను తిట్టను: తీన్మార్‌ మల్లన్న

‘ఒట్టేసి చెపుతున్న.. ఇక నుంచి కేసీఆర్‌ను ఒక్క మాట కూడా తిట్టను. ‘7200 మూవ్‌మెంట్‌’ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి దోపిడీ రాజ్యం పోయి ప్రజా ప్రభుత్వం ఏర్పడేదాకా పోరాటం

Updated : 06 May 2022 07:29 IST

గజ్వేల్‌, న్యూస్‌టుడే: ‘ఒట్టేసి చెపుతున్న.. ఇక నుంచి కేసీఆర్‌ను ఒక్క మాట కూడా తిట్టను. ‘7200 మూవ్‌మెంట్‌’ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి దోపిడీ రాజ్యం పోయి ప్రజా ప్రభుత్వం ఏర్పడేదాకా పోరాటం చేస్తా’ అని తీన్మార్‌ మల్లన్న స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో గురువారం నిర్వహించిన ‘7200 మూవ్‌మెంట్‌’ సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి, మంత్రులపై విమర్శలు చేయటం తమ విధానం కాదన్నారు. ప్రజా చైతన్యానికే తమ పోరాటమన్నారు. విద్యావంతులైన బాల్క సుమన్‌, గాదరి కిషోర్‌లకు విద్యాశాఖను అప్పగిస్తే బాగుంటుందన్నారు. పేదోళ్ల, పెద్దోళ్ల బిడ్డలు ఒకే పాఠశాలలో వరుసలో కూర్చొని చదువుకోవాలన్నదే తమ మూవ్‌మెంట్‌ లక్ష్యమన్నారు. అకాల వర్షాలొచ్చి రాష్ట్రమంతటా రైతులు ఆగమాగం అవుతుంటే ముఖ్యమంత్రి మాత్రం వ్యవసాయ క్షేత్రం విడిచి బయటకు రావడం లేదన్నారు. యాదాద్రిలో రూ.వందల కోట్లు వెచ్చించి చేసిన అభివృద్ధి ఒక్క గాలివానకే తేలిపోయిందని పేర్కొన్నారు. తమ ఆస్తులన్నీ ప్రభుత్వానికి రాసిచ్చి జూన్‌ రెండో వారంలో చేపట్టే ప్రజాపాదయాత్రలో పాల్గొంటామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్‌ రజనీకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని