జూన్‌ 2న తెలంగాణ ఆత్మగౌరవ దీక్ష: తెజస

తెరాస నేతృత్వంలోని దోపిడీ, దళారీ, భూదందా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జూన్‌ 2న ఇందిరాపార్కు వద్ద తలపెట్టిన ఆత్మగౌరవ దీక్షను విజయవంతం చేసేందుకు ఉద్యమకారులందరూ కలిసిరావాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌

Published : 19 May 2022 05:03 IST

అబిడ్స్‌, న్యూస్‌టుడే: తెరాస నేతృత్వంలోని దోపిడీ, దళారీ, భూదందా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జూన్‌ 2న ఇందిరాపార్కు వద్ద తలపెట్టిన ఆత్మగౌరవ దీక్షను విజయవంతం చేసేందుకు ఉద్యమకారులందరూ కలిసిరావాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని తెజస రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తి కావస్తున్నా ఇక్కడి ప్రజల ఆకాంక్షల్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా కుటుంబ పరిపాలన కొనసాగిస్తున్నారని సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. తెరాస ప్రభుత్వ హయాంలో ఇంతవరకు ఎంత మందికి ఉద్యోగాలు కల్పించారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో ఉద్యమకారులకు ఆత్మగౌరవం లేకుండా పోయిందని, సమాచార కమిషన్‌ పని చేయదని, ప్రశ్నించే గొంతుకలకు స్థానం లేకుండా చేశారన్నారు. తెజస ఉపాధ్యక్షులు పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని