అచ్చం శ్రీలంకలాగే భారత్‌ పరిస్థితి

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో విలవిల్లాడుతున్న శ్రీలంకకు ఏమాత్రం తీసిపోని రీతిలో భారత్‌లో దుర్భర పరిస్థితులు ఉన్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. నిరుద్యోగం, పెట్రోలు ధరలు, మత హింస లాంటి విషయాల్లో రెండు దేశాల మధ్య

Published : 19 May 2022 05:03 IST

 రెండు దేశాలను పోలుస్తూ గ్రాఫ్‌లు పంచుకున్న రాహుల్‌

దిల్లీ: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో విలవిల్లాడుతున్న శ్రీలంకకు ఏమాత్రం తీసిపోని రీతిలో భారత్‌లో దుర్భర పరిస్థితులు ఉన్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. నిరుద్యోగం, పెట్రోలు ధరలు, మత హింస లాంటి విషయాల్లో రెండు దేశాల మధ్య సారూప్యత కనిపిస్తోందన్నారు. ఈ మేరకు రెండు దేశాల పరిస్థితులను పోలుస్తూ ట్విటర్‌లో గ్రాఫ్‌లు పంచుకున్నారు. వాటి ప్రకారం భారత్‌, శ్రీలంకల్లో 2017 తర్వాత నిరుద్యోగిత రేటు క్రమంగా పెరుగుతూ 2020లో శిఖరస్థాయికి చేరింది. ఆ తర్వాతి ఏడాది కాస్త తగ్గింది. అలాగే పెట్రోలు ధరలు 2017 నుంచి అంతకంతకు పెరుగుతూ 2021కల్లా అత్యధికస్థాయికి చేరాయి. మతహింస కూడా రెండు దేశాల్లో 2020-21లో అనూహ్యంగా పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని