కేసీఆర్‌ తీరుతో స్వరాష్ట్రంలోనూ ప్రజలకు కష్టాలే: ప్రవీణ్‌కుమార్‌

ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు అధికారం ఇచ్చిన ప్రజలు ఆయన తీరుతో సొంత రాష్ట్రంలోనూ కష్టాలను ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని బీఎస్పీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త

Published : 20 May 2022 05:36 IST

కురవి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు అధికారం ఇచ్చిన ప్రజలు ఆయన తీరుతో సొంత రాష్ట్రంలోనూ కష్టాలను ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని బీఎస్పీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బహుజనుల రాజ్యాధికార యాత్రలో భాగంగా ఆయన గురువారం మహబూబాబాద్‌ జిల్లా కురవితోపాటు నేరడ గ్రామంలో పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీలు, గ్రామాల్లో చిరువ్యాపారుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ధాన్యాన్ని కొనుగోలు చేసేవారు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగి ప్రజల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. నెలకు రూ.4 లక్షలకుపైగా వేతనం తీసుకుంటున్న కేసీఆర్‌ పేద ప్రజల కోసం ఆలోచించకుండా ప్రగతిభవన్‌లో ఉండి ఎన్నికల్లో ఎలా గెలుపొందాలి, ఇతర పార్టీలను ఎలా ఓడించాలని కుట్రలు పన్నుతున్నారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని