రాజ్యసభ అభ్యర్థిగా రవిచంద్ర నామినేషన్‌

తెలంగాణలో ఒక రాజ్యసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు తెరాస పార్టీ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర నామినేషన్‌ దాఖలు చేశారు. గురువారం శాసనసభలో ఎన్నికల రిటర్నింగ్‌

Published : 20 May 2022 05:36 IST

మంత్రులు గంగుల, పువ్వాడ హాజరు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ఒక రాజ్యసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు తెరాస పార్టీ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర నామినేషన్‌ దాఖలు చేశారు. గురువారం శాసనసభలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఉపేందర్‌రెడ్డికి నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. నామినేషన్‌ దాఖలు కంటే ముందు ఆయన గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఎమ్మెల్సీగా ఉన్న బండా ప్రకాశ్‌ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఉప ఎన్నికకు శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. గురువారం వరకు రవిచంద్ర ఒక్కరే నామినేషన్‌ వేశారు. తెరాసకు పూర్తి మెజారిటీ ఉన్నందున ఆయనే ఏకగ్రీవమయ్యే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని