ఎయిమ్స్‌లో వైద్యసేవల కల్పనలో కేంద్రం విఫలం

రాష్ట్ర ప్రభుత్వమే రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన భవనాలు, భూములు అప్పగించినా బీబీనగర్‌ ఎయిమ్స్‌లో వైద్య సేవలు అందించడంలో కేంద్రం విఫలమైందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం

Published : 21 May 2022 05:13 IST

భాజపా నాయకులకు ఈ దుస్థితి కనబడటం లేదా?
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌

భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వమే రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన భవనాలు, భూములు అప్పగించినా బీబీనగర్‌ ఎయిమ్స్‌లో వైద్య సేవలు అందించడంలో కేంద్రం విఫలమైందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన ఎయిమ్స్‌ ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం భువనగిరి జిల్లా కేంద్రాసుపత్రిలో టీఎస్‌ డయాగ్నొస్టిక్‌ కేంద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపనతో పాటు పిల్లల వార్డును ప్రారంభించారు. ఈ సందర్భాల్లో మంత్రి మాట్లాడుతూ.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎయిమ్స్‌ను పలుమార్లు సందర్శించారే తప్ప సదుపాయాలపై కేంద్రాన్ని అడగలేదని విమర్శించారు. ఎయిమ్స్‌లో 20 మందే ఇన్‌పేషెంట్లుగా ఉన్న విషయాన్ని గమనించిన మంత్రి.. ఇలాంటి పెద్దాసుపత్రిలో ఇంత తక్కువ రోగులు ఉండడం దారుణమన్నారు. ఇక్కడి వైద్యవిద్యార్థులకు క్లినికల్స్‌, ప్రాక్టికల్స్‌ నిర్వహణకూ సౌకర్యం లేనందున వారి భవిష్యత్తు దృష్ట్యా భువనగిరి జిల్లా కేంద్రాసుపత్రిలో వాటికి అనుమతించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన సూర్యాపేట, నల్గొండ వైద్య కళాశాలలు ఎంత బ్రహ్మాండంగా నడుస్తున్నాయో.. భాజపా నాయకులు చూడాలని హితవు పలికారు. గొప్పలు చెప్పుకొంటున్న ఆ పార్టీ నాయకులకు ఎయిమ్స్‌ దుస్థితి కనపడటం లేదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్‌ సందీప్‌రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్‌, ఎంపీ లింగయ్యయాదవ్‌, ప్రజారోగ్య సంచాలకుడు(డీహెచ్‌) శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని