ఏ గ్రామంలోనూ ప్రజలు సంతోషంగా లేరు

‘‘తొమ్మిది నెలల్లో 537 గ్రామాల్లో 6,500 కిలోమీటర్లు ప్రయాణించా. ఏ ఒక్క గ్రామంలోనూ ప్రజలు సంతోషంగా లేరు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ, అగ్ర వర్ణాల్లోని పేదలు అనేక

Published : 22 May 2022 05:17 IST

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

నిర్మల్‌, ఇచ్చోడ, న్యూస్‌టుడే: ‘‘తొమ్మిది నెలల్లో 537 గ్రామాల్లో 6,500 కిలోమీటర్లు ప్రయాణించా. ఏ ఒక్క గ్రామంలోనూ ప్రజలు సంతోషంగా లేరు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ, అగ్ర వర్ణాల్లోని పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సీఎం కేసీఆర్‌ ప్రజలను ముంచుతున్నారు’’ అని బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు. శనివారం ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో ఆయన పర్యటించారు. ఇచ్చోడ, లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్‌లలో ర్యాలీ నిర్వహించారు. బడా బాబులకు ప్రైవేటు విశ్వవిద్యాలయాలను మంజూరు చేసిన ప్రభుత్వం.. ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజన వర్సిటీ విషయంలో చిత్తశుద్ధిని ప్రదర్శించలేదని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్‌కు సమయం దొరికినప్పుడల్లా ఫాంహౌస్‌, దిల్లీకి వెళ్తున్నారే తప్ప పాలన చేయడం లేదని ఎద్దేవా చేశారు. ఇంటి నుంచి పొలానికి వెళ్లేందుకు ముఖ్యమంత్రి ఏడాదికి చేసిన ఖర్చు రూ.79 కోట్లని.. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతోందని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని