దేశంలో అవినీతిలేని రాష్ట్రం తెలంగాణే

దేశంలో అవినీతికి తావులేకుండా పాలనను అందిస్తున్న రాష్ట్రం తెలంగాణేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జై శ్రీరాం అనే పార్టీలకు దీటుగా తెరాస నాయకులంతా జై హనుమాన్‌

Published : 22 May 2022 05:17 IST

ఎమ్మెల్సీ కవిత

ఈనాడు, కరీంనగర్‌: దేశంలో అవినీతికి తావులేకుండా పాలనను అందిస్తున్న రాష్ట్రం తెలంగాణేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జై శ్రీరాం అనే పార్టీలకు దీటుగా తెరాస నాయకులంతా జై హనుమాన్‌ అనాలని సూచించారు. శనివారం జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో కోరుట్ల నియోజకవర్గ స్థాయి తెరాస విస్తృతస్థాయి సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అనంతరం కొండగట్టు అంజన్న దేవాలయాన్ని దర్శించుకుని హనుమాన్‌ చాలీసా పారాయణంలో పాల్గొన్నారు. మెట్‌పల్లిలో కవిత మాట్లాడుతూ.. రచ్చబండ కార్యక్రమాలతో గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్‌ నాయకులకు ఊళ్లల్లో జరిగిన అభివృద్ధిని చూపించాలన్నారు. దేవుడి పేరు చెప్పి భయపెట్టించే వారికి భయపడొద్దన్నారు. రాజకీయం మొత్తం దాని చుట్టూ తిప్పుతామని ఎదుటి పార్టీ వాళ్లంటే మనం అమాయకంగా ఉండొద్దని చెప్పారు. దేవుడి కన్నా భక్తుడే గొప్పని.. నాయకుడికన్నా ప్రజలే గొప్పని, అవసరమైతే దేవుణ్ని కూడా ప్రశ్నించే తత్వం తెలంగాణవారిదని ఆమె అన్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, సుంకె రవిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని