Published : 23 May 2022 04:33 IST

బారాణా పెంచి.. చారాణే తగ్గించి క్షీరాభిషేకాలా?

పెట్రోధరల తగ్గింపుపై హరీశ్‌ ఎద్దేవా

సికింద్రాబాద్‌, న్యూస్‌టుడే: ‘బారాణా పెంచి చారాణే తగ్గించి క్షీరాభిషేకాలు చేసుకుంటుండ్రు. నిజంగా మీకు నిజాయతీ ఉంటే 2014లో భాజపా అధికారంలోకి వచ్చిన్నాడు పెట్రోల్‌, డీజిల్‌పై ఏ సెస్సైతే ఉండెనో ఆడికి తీసుకరా. పెంచింది నువ్వే.. దించి చప్పట్లు కొట్టుడు, జబ్బలు జరుసుకునుడేంది’ అంటూ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఆదివారం గాంధీ ఆసుపత్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం డీజిల్‌ మీద సెస్సు రూ.7.40, పెట్రోల్‌పై రూ.16.40 పైసలుందన్నారు. కేంద్రంలో మీరు అధికారంలోకి వచ్చిన రోజున ఏ సెస్సు ఉందో అక్కడికి తీసుకొచ్చి మాట్లాడాలని భాజపా నాయకులకు చురకలంటించారు. రోజుకింత చొప్పున పెంచుకుంటూ పోయి కొంతే తగ్గించి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రప్రభుత్వం కూడా సెస్‌ తగ్గించాలని భాజపా నాయకులు చేస్తున్న డిమాండ్‌పై స్పందిస్తూ.. పెంచితే కదా తాము తగ్గించేదని మంత్రి ఎదురు ప్రశ్నించారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చినపుడు సిలిండర్‌ ధర రూ.నాలుగు వందలుంటే ప్రస్తుతం రూ.వెయ్యికిపైగా చేరిందన్నారు. ఇప్పుడేదో రూ.200 తగ్గించి.. అదీ కొంత మందికే లబ్ధి కలిగేలా నిర్ణయం తీసుకున్నారన్నారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని