Published : 24 May 2022 04:55 IST

రాజ్యసభకు వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవం

ఈనాడు, హైదరాబాద్‌: రాజ్యసభకు తెరాస అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం ముగియగా... ఉపఎన్నిక బరిలో రవిచంద్ర మాత్రమే మిగలడంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదంతో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఉపేందర్‌రెడ్డి నుంచి రవిచంద్ర ధ్రువీకరణపత్రం స్వీకరించారు. ఆయన 2024 ఏప్రిల్‌ వరకు రెండేళ్లు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగనున్నారు. అనంతరం రవిచంద్ర మాట్లాడుతూ ఇంత పెద్ద గౌరవం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం, సీఎం కేసీఆర్‌ గౌరవం పెంచేలా పని చేస్తానన్నారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని