మరో 12 నెలల్లో కాంగ్రెస్‌ రైతురాజ్యం

కేసీఆర్‌ కుటుంబాన్ని తెలంగాణ పొలిమేర దాటించి మరో 12 నెలల్లో కాంగ్రెస్‌ రైతురాజ్యం అధికారంలోకి వస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పారు.

Published : 24 May 2022 04:55 IST

రచ్చబండ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

శామీర్‌పేట, న్యూస్‌టుడే: కేసీఆర్‌ కుటుంబాన్ని తెలంగాణ పొలిమేర దాటించి మరో 12 నెలల్లో కాంగ్రెస్‌ రైతురాజ్యం అధికారంలోకి వస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పారు. సోమవారం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలంలోని సీఎం దత్తత గ్రామం లక్ష్మాపూర్‌లో రచ్చబండ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఏడేళ్ల క్రితం కేసీఆర్‌ లక్ష్మాపూర్‌ను దత్తత తీసుకుంటే భూసమస్యలు పరిష్కారమవుతాయని రైతులు భావించారని.. కానీ, సీఎం వారిని నట్టేట ముంచారని ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డి అభివృద్ధిని గాలికి వదిలి ఆస్తులు కూడగట్టే పనిలో ఉన్నారని దుయ్యబట్టారు. మంత్రి, ఆయన బావమరిది భూకబ్జాలు, అక్రమాలు, అవినీతిపై కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే విచారణ చేయిస్తామని పేర్కొన్నారు. కేసీఆర్‌ నిజాయతీపరుడైతే తాను చేసిన ఆరోపణలపై విచారణ చేయించాలని.. నిరూపితం కాకపోతే ఎలాంటి చర్యలకైనా సిద్ధమని రేవంత్‌ సవాల్‌ విసిరారు.
- ‘‘తెలంగాణలో రోజుకు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే.. ఫాంహౌస్‌ గడపదాటి ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించని కేసీఆర్‌, పంజాబ్‌ రైతులకు పరిహారం ఇచ్చారు. మర్మమేంటో మన రైతన్నలకు అర్థం కాదనుకుంటున్నారా?’’ అని రేవంత్‌రెడ్డి ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని