
1, 2 తేదీల్లో తెలంగాణ కాంగ్రెస్ వర్క్‌షాప్
ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వర్క్‌షాప్‌ను జూన్ 1, 2 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. రాజస్థాన్‌లో ఇటీవల జరిగిన పార్టీ చింతన్ శిబిర్‌లో తీసుకున్న నిర్ణయాలపై ఈ వర్క్‌షాప్‌లో చర్చిస్తామని చెప్పారు. మంగళవారమిక్కడ గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని, రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ డిక్లరేషన్‌ను రైతు రచ్చబండ ద్వారా ప్రజల్లోకి తీసుకెళుతున్నామని చెప్పారు. రెడ్డి, వెలమ కులాల విషయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆ వ్యాఖ్యలతో తాను విభేదిస్తున్నానని స్పష్టం చేశారు. ఏ ఒక్క వర్గం కోసమో, ఒక కులం కోసమో కాంగ్రెస్ పనిచేయదని చెప్పారు. పార్టీలో అన్ని సామాజిక వర్గాల నాయకులు కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- బిగించారు..ముగిస్తారా..?
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు
- Shiv Sena: టార్గెట్ ఠాక్రే.. అసలు సిసలు ‘మహా’ రాజకీయ వ్యూహం..!