భాజపా అధికారంలోకి వస్తే మదర్సాలు, మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తాం

తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తే మదర్సాలను, మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు వర్తింపజేస్తామని ఆ పార్టీ  రాష్ట్ర

Published : 26 May 2022 05:32 IST

హిందూ ఏక్తాయాత్రలో సంజయ్‌

కరీంనగర్‌ సాంస్కృతికం, తెలంగాణ చౌక్‌, న్యూస్‌టుడే: తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తే మదర్సాలను, మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు వర్తింపజేస్తామని ఆ పార్టీ  రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. హనుమాన్‌ జయంతి సందర్భంగా కరీంనగర్‌లో బుధవారం రాత్రి నిర్వహించిన హిందూ ఏక్తాయాత్రలో ఆయన మాట్లాడారు.  రెండో అధికారిక భాషగా ఉన్న ఉర్దూను నిషేధిస్తామన్నారు. తెలంగాణకు పట్టిన పీడను వదిలించి రామరాజ్యాన్ని స్థాపించి తీరుతామన్నారు. జిల్లా ప్రజలకు ఏ ఆపదొచ్చినా పెద్ద కొడుకుగా ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటానన్నారు. కార్యక్రమంలో సాధు పరిషత్తు అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీ, మాజీ ఎమ్మెల్యేలు కటకం మృత్యుంజయం, బొడిగె శోభ, సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాల భాజపా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, కృష్ణారెడ్డిలు పాల్గొన్నారు.

ముఖం చెల్లకే సీఎం బెంగళూరుకు: లక్ష్మణ్‌
బేగంపేట, న్యూస్‌టుడే: ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వస్తున్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముఖం చెల్లక బెంగళూరు పర్యటన పెట్టుకున్నారని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు. ప్రధాని రాక సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాట్లను బుధవారం భాజపా నేతలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో లక్ష్మణ్‌ మాట్లాడారు. ప్రధాని తెలంగాణకు రావడం భరోసానిచ్చే అంశమని పేర్కొన్నారు. ప్రొటోకాల్‌ను పట్టించుకోకుండా ప్రధాని పర్యటనను ముఖ్యమంత్రి రాజకీయ కోణంలో చూస్తున్నారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని