రాహుల్‌ విదేశీ పర్యటనకు ప్రభుత్వ అనుమతి అక్కర్లేదు: కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ తన లండన్‌ పర్యటనకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోలేదంటూ వచ్చిన వార్తలను బుధవారం కాంగ్రెస్‌ ఖండించింది. ‘‘అధికారిక ప్రతినిధి బృందంలో భాగంగా

Published : 26 May 2022 05:18 IST

దిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ తన లండన్‌ పర్యటనకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోలేదంటూ వచ్చిన వార్తలను బుధవారం కాంగ్రెస్‌ ఖండించింది. ‘‘అధికారిక ప్రతినిధి బృందంలో భాగంగా వెళితే తప్ప ఎంపీలు.. తమ విదేశీ పర్యటనలకు ప్రధాని లేదా ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. పీఎంవో కార్యాలయం నుంచి టీవీ ఛానళ్లకు పంపే వాట్సాప్‌ సూచనలు గుడ్డిగా అనుసరించకండి’’ అని ఆ పార్టీ అధికారిక ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా ట్వీట్‌ చేశారు. యూకే పర్యటనలో రాహుల్‌.. మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంపై భాజపా కిరోసిన్‌ చల్లిందని, మంటలు వ్యాపించడానికి చిన్న నిప్పురవ్వ చాలని వ్యాఖ్యలు చేశారు. దీంతో భాజపా.. రాహుల్‌పై విమర్శలు చేసింది. విదేశీ గడ్డపై కాంగ్రెస్‌ నేత భారత్‌ పరువు తీస్తున్నారని మండిపడింది. భారత్‌ వ్యతిరేక అభిప్రాయాలను వ్యక్తపరిచే లేబర్‌ పార్టీ ఎంపీ జెర్మీ కార్బిన్‌ను రాహుల్‌ కలవడం కూడా వివాదాస్పదమైంది. వ్యక్తిగత హోదాలో విదేశాల్లో పర్యటించేటపుడు ఎంపీలు అనుమతులు తీసుకోనవసరం లేదని లోక్‌సభ సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని