వచ్చే నెలలో 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు

దేశంలోని ఆరు రాష్ట్రాలకు చెందిన 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు జూన్‌ 23న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం (ఈసీ) బుధవారం ప్రకటించింది. 26న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.

Published : 26 May 2022 05:18 IST

దిల్లీ: దేశంలోని ఆరు రాష్ట్రాలకు చెందిన 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు జూన్‌ 23న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం (ఈసీ) బుధవారం ప్రకటించింది. 26న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఎన్నికలు నిర్వహించే స్థానాలివే..
లోక్‌సభ నియోజకవర్గాలు: ఆజమ్‌గఢ్‌, రామ్‌పుర్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌), సంగ్రూర్‌ (పంజాబ్‌). యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ నేతలు అఖిలేశ్‌ యాదవ్‌, ఆజమ్‌ఖాన్‌లు గెలుపొందడంతో వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆజమ్‌గఢ్‌, రామ్‌పుర్‌లు ఖాళీ అయ్యాయి. ఆప్‌ నేత భగవంత్‌ మాన్‌ పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సంగ్రూర్‌లో ఖాళీ ఏర్పడింది.

అసెంబ్లీ స్థానాలు: రాజేందర్‌ నగర్‌ (దిల్లీ), మందార్‌ (ఝార్ఖండ్‌), ఆత్మకూరు (ఆంధ్రప్రదేశ్‌), అగర్తల, టౌన్‌ బార్దోవాలీ, సుర్మా, జుబరాజ్‌నగర్‌ (త్రిపుర).

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని